Viral Video: మారణాయుధాలు, బండబూతులతో రెచ్చిపోయిన యువకుడు.. నెట్టింట వీడియో వైరల్!
- నడిరోడ్డుపై రెచ్చిపోయిన యువకుడు..
- మద్యం మత్తులో మారణాయుధాలతో తిరిగిన వ్యక్తి..
- పోలీసులతో పాటు ఓ అమ్మాయిని బండబూతులు తిట్టిన వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: పట్టపగలే ఓ యువకుడు రెచ్చిపోయిన ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. మద్యం మత్తులో మారణాయుధాన్ని వెంటేసుకుని రోడ్డుపై తిరుగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యువకుడు చేతిలో కొడవలి లాంటి ఆయుధంతో తిరుగుతున్న ఈ దృశ్యాలు స్థానికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అతడి ప్రవర్తనపై స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని పట్టుకోగా, వారిని కూడా బూతులతో తిట్టుతూ, రెచ్చిపోయినట్లుగా కింది వీడియోలో కనిపిస్తుంది. అతనితో పాటు ఉన్న ఓ యువతిని కూడా అతడు అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, “చంపేస్తా” అంటూ బెదిరింపులకు దిగాడు.
Read Also: Prabhas: ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ కోసం కౌంట్‌డౌన్ మొదలైంది!
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
అయితే, పోలీసులు వెంటనే అతని దగ్గర ఉన్న వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజెన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన ఆ యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని నెటిజన్స్ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీడు పోలీసుల చేతిలో ఉంటేనే వాడి ప్రవర్తన అలా ఉంటే మామూలు ప్రజల పరిస్థితి ఏంటి…అదే ఒక ఆడపిల్లని ఏమన్నా చేస్తే ఏమవుతుంది…పోయిన ప్రాణాలు మళ్ళీ వెనక్కి తీసుకురాగలమా…
మళ్ళీ వీళ్ళని కోర్టుకి తీసుకువెళ్ళి …లా ప్రకారం శిక్షించాలి అంటారు కొంత మంది మేధావులు…ఎక్కువ మాట్లాడితే… pic.twitter.com/vRCeVO0jR8
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) July 15, 2025
తాజావార్తలు
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!