బెంగాల్ పంచాయితీ ఎన్నికలలో హింసాత్మక సంఘటనలు జరిగిన ఒక రోజు తర్వాత, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం అనేక పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలను రద్దు చేసింది. జులై 10, సోమవారం రోజున ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజా పోల్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
బెంగాల్‌లోని వివిధ ప్రాంతాల్లో రాళ్లు రువ్వడం, దహనం చేయడంతో పాటు దోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. గత రాత్రి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనల్లో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.
మణిపూర్‌లో పరిస్థితులు ఇంకా సద్దుమణగ లేదు. రెండు జాతుల మధ్య మే 2న ప్రారంభమైన రావణకాష్టం ఇంకా కాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈశాన్య భారత రాష్ట్రమైన మణిపూర్‌లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. రెండు వర్గాల మధ్య మొదలైన ఘర్షణ రాష్ట్రంలో పెద్దఎత్తున అల్లర్లకు కారణంగా మారింది. గత రెండు నెలలుగా మైయిటీ, కూకీ తెగల మధ్య ఘర్షణ రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతోంది.
మణిపూర్‌లో జరుగుతున్న హింసను అదుపు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే గత రెండు నెలలుగా ప్రభుత్వాల ప్రయత్నాలు సఫలం కావడం లేదు.
జూలై 8న పశ్చిమ బెంగాల్‌లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికల ముందు రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగుతోంది. గత నెల నుండి రాష్ట్రంలోని అనేక జిల్లాల నుండి హింస వార్తలు నిరంతరం వస్తూనే ఉన్నాయి. ఈలోగా ఎన్నికల ఔత్సాహికులు జోరందుకున్నారు. ముర్షిదాబాద్‌లో తృణమూల్, సీపీఎం మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా గవర్నర్ కాన్వాయ్‌కు నల్లజెండాలు చూపించారు. ముర్షిదాబాద్ జిల్లా డోమ్‌కోల్‌లో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో హింస చెలరేగింది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి పాకిస్తాన్‌లో మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించిన నివేదిక ఒకటి వెలుగులోకి వచ్చింది. సస్టైనబుల్ సోషల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (SSDO) నివేదిక ప్రకారం, ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మహిళలు, పిల్లలపై హింసకు సంబంధించి 900 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.
మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. 3 గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర సీఎం ఎన్ బీరెన్ సింగ్‌ను తొలగించాలని ప్రతిపక్షం డిమాండ్ చేయగా.. పలువురు ప్రతిపక్ష నాయకులు రాష్ట్రానికి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని పంపాలని కోరారు.
మణిపూర్ లో మళ్లీ హింస చెలరేగింది. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు మే 3న ప్రారంభించిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో పలువురు ప్రజాప్రతినిధులపై దాడులు చేసి వారి ఇళ్లకు నిప్పు పెట్టారు. సుదీర్ఘమైన జాతి హింస ఫలితంగా క్యాబినెట్ మంత్రులతో సహా పలువురు ప్రజా ప్రతినిధులు దాడికి గురయ్యారు. ఈ హింస ఘటనలో బిజెపి నాయకుల నివాసాలను ధ్వంసం చేసి.. దాడికి ప్రయత్నించారు. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి ఆర్.కె రంజన్ సింగ్…