హర్యానాలోని నుహ్ హింసాత్మక ఘటనలో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా బాధితులను గుర్తించి పరిహారం ఇస్తామని పేర్కొన్నారు.
మణిపూర్ హింసపై విచారణ జరుపుతున్న సుప్రీం కోర్టు మంగళవారం కూడా విచారణను కొనసాగించింది. మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం మణిపూర్ పోలీస్ శాఖపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
మణిపూర్ లో ఇటీవల ఆంక్షలు ఎత్తివేసిన నిమిషాల్లోనే మరోసారి అంతర్జాల వినియోగంపై ఆంక్షలు విధించింది. ఫార్వార్డ్ మెసేజులతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టిన కారణంగా మణిపూర్ ప్రభుత్వం మళ్లీ ఆంక్షలు పెట్టింది.
మణిపూర్ లో హింసాకాండ ఆగడం లేదు. మరోసారి కాల్పులకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో ఒక పాఠశాల, పది ఇళ్లకు నిప్పు పెట్టడంతో దగ్ధమయ్యాయి.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మే 3 నుంచి హింస కొనసాగుతోంది. గత రెండున్నర నెలలుగా మణిపూర్‌లో హింస కొనసాగుతుండగా.. హింసను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ఏవీ విజయవంతం కాలేదు.
మణిపూర్లో జరుగుతున్న హింస దారుణమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్ ఘటనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ మండిపడ్డారు.
మణిపూర్ లో గత రెండున్నర ఏళ్లుగా హింస కొనసాగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ.. ఎటువంటి హెచ్చరికలు జారీ చేసినా ఇప్పటికే హింస ఆగడం లేదు.