రాష్ట్రంలోని హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ ఆరా తీస్తోంది. కాసేపట్లో ఎన్నికల సంఘం ముందు మూడు జిల్లాల ఎస్పీలు హాజరు కానున్నారు. ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలను తన వద్దకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ఆదేశించారు.
Manipur Violence Latest Updates: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని మరోసారి కాల్పులు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలో బుధవారం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన బిష్ణుపూర్ జిల్లాలోని కుంబి, తౌబల్ జిల్లాలోని వాంగూ కమ్యూనిటీ మధ్య జరిగింది. కాల్పులు జరిగిన ప్రాంతానికి సమీపంలో అల్లం కోయడానికి వెళ్లిన నలుగురు వ్యక్తులుఅదృశ్యం అయ్యారు. భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని కూంబింగ్ నిర్వహించాయి. ఈ కాల్పుల వల్ల 100 మందికి పైగా మహిళలు, పిల్లలు మరియు వృద్ధులు…
హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. వివస్త్రని చేసి గోళ్ళతో రక్కి తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ వద్ద ఉన్న బంగారు నగలును అపహరించారు.
సుమారు మూడున్నర నెలలకు పైగా మణిపూర్‌లో హింస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మణిపూర్‌లో హింసను నియంత్రించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నిచర్యలు తీసుకున్నప్పటికీ నియంత్రణ కావడం లేదు.
మరోవైపు మణిపూర్ మండిపొతున్నా కేంద్రం చోద్యం చూస్తుందని దుయ్యబట్టారు. గుజరాత్ తరహా కుట్రలు మణిపూర్ లో అంతకు మించి చేశారని ఆరోపించారు. మణిపూర్ లో విద్వేషాలు రెచ్చ గొట్టింది బీజేపీనేనని విమర్శించారు సీపీఐ నారాయణ అన్నారు.
తోవాయి గ్రామంలో ముగ్గురు మృతి చెందిన ఘటనపై.. గిరిజనులు నిరసన చేపట్టారు. కుకీ-జో కమ్యూనిటీ ఆధిపత్యం ఉన్న కాంగ్‌పోక్పి జిల్లాలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వందలాది మంది మహిళలు నిన్న మధ్యాహ్నం నుంచి జాతీయ రహదారిపై ధర్నా చేయడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా అక్కడ నిరసనలు కొనసాగుతున్నాయి.
గత నెలలో హర్యానాలోని నుహ్ జిల్లాలో మతపరమైన ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. నుహ్‌లో జరిగిన మత ఘర్షణల ప్రభావం దేశ రాజధాని ఢిల్లీలో జరగకుండా చూడాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఆదేశించింది.
హర్యానాలో కొనసాగుతున్న అల్లర్ల నుంచి అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఒకరు త్రుటిలో తప్పించుకున్నారు. తనతోపాటు ఉన్న మూడేళ్ల చిన్నారి కూడా ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంది.