అతడు పాత నేరస్థుడు కాదు, అతనిపై కేసులు అస్సలు లేవు.. అక్కడేమి పెద్ద గొడవ కూడా కాలేదు. అస్సలు అతని తప్పేమీ లేదు. కేవలం తోపులాట. అయితే ఆ సీన్ ను ఓ సినిమాలో చూపించి నట్లుగా పోలీసులు వ్యవహరించారు. అవతలి వ్యక్తి ఫిర్యాదునే ప్రామాణికంగా తీసుకుని.. నిజానిజాలు పరిశీలించకుండా.. నేరం చేయని వాడిపై క్రూరంగా ప్రవర్తించారు. ఈ ఘటనను స్థానికుడు ఒకరు బాత్‌రూంలో ఉంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.…
https://youtu.be/OhCCLSb_rV8 అవును.. శ్రీలంకలో అదే జరుగుతోంది. ఆనాడు రామాయణంలో హనుమంతుడు లంకను తగులబెట్టాడని అంటారు. చూసి రమ్మంటే కాల్చివచ్చాడంటారు. కానీ ఇప్పుడు లంకలో ఆ దేశ ప్రజలే హింసకు పాల్పడుతున్నారు. అధ్యక్షుడు, ప్రధాని, మంత్రులు.. ఎవరి ఇళ్ళను వదిలిపెట్టడం లేదు. ఎంపీలు, మాజీ మంత్రుల ఇళ్లకు ఆందోళనకారులు సాయంత్రం నిప్పు పెట్టారు. సోమవారం నాడు మధ్యాహ్నం ప్రధాని రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. రాజపక్సే రాజీనామా చేసిన తర్వాత కూడా ఆందోళనలు సద్దుమణగలేదు. కొలంబోలో శాంతియుతంగా…
ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిగ్ బాస్ షోపై వ్యాజ్యం …సీజె ధర్మాసనం ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది. రియాల్టీ షో’ పేరిట ఏదైనా చూపిస్తామంటే ఉపేక్షించేది లేదని హైకోర్ట్ ఫైర్ అయింది. బిగ్ బాస్ షోపై దాఖలైన వ్యాజ్యం విషయంలో హైకోర్టు సీరియస్ అయింది. రియాల్టీ షోలో ఏం చూపినా కళ్లు మూసుకొని ఉండలేం అని హైకోర్ట్ వ్యాఖ్యానించింది. రియాలిటీ షోలలో హింసను ప్రోత్సహిస్తున్నారు.. అది సంస్కృతి…
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలుపుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. శ్రీలంక నైరుతి ప్రాంతమైన రాంబుక్కనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంధన ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి…
గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన శ్రీరామ నవమి హింసాత్మక ఘటనలపై ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. విద్వేషం, హింస భారత దేశాన్ని బలహీనపరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యంతో కూడిన పునాదులు పురోగతికి మార్గం వేస్తాయన్నారు. భిన్న సంస్కృతి, సమ్మిళిత భారతదేశాన్ని కాపాడుకునేందుకు కలిసి నిలబడాలని ట్వీట్ చేశారు. శ్రీరామనవమి ఊరేగింపుల సందర్భంగా మధ్యప్రదేశ్ ఖార్గోన్ నగరంలో అల్లర్లు చెలరేగాయి. కనీసం 10 ఇళ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో…
పశ్చిమ బెంగాల్‌లో మరోసారి హింస జరిగింది.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. ఎన్నికల సమయంలో.. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది.. దీనిపై ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.. ఇక, ఇప్పుడు బీర్‌భూం జిల్లా రామ్‌పుర్ హాట్ రాజకీయ హింసపై, అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. పట్టణ శివారులోని బోగ్‌టూయి గ్రామంలో ఎనిమిది ఇళ్లు అగ్నికి ఆహుతై ఇద్దరు చిన్నారులతో పాటు ఎనిమిది మంది సజీవ దహనం కావడం విషాదం నింపింది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన…
రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అన్ని దేశాలను టెన్షన్ పెడుతున్నాయి.. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ప్రారంభించిన రష్యా.. ఆ దేశ రాజధాని వైపు దూసుకెళ్తుండగా.. మరోవైపు ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యా తగిన మూల్యం చెల్లించకతప్పదని అమెరికా హెచ్చరిస్తూ వస్తోంది.. ఇక, ఉక్రెయిన్ నుంచి కొంత మంది భారతీయులను తరలించినా.. ఇంకా చాలా మంది ఉక్రెయిన్‌లో ఉంటున్నారు.. ఈ నేపథ్యంలో.. రంగంలోకి దిగారు భారత ప్రధాని నరేంద్ర మోడీ.. ఉక్రెయిన్‌లో ఉంటున్న భారతీయ పౌరుల భద్రత, క్షేమం కోసం…
మావోయిస్టులు తమ ప్రతాపం చూపుతున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. గతంలో జేసీబీలు, రోడ్ల నిర్మాణం చేపట్టే యంత్రాలకు నిప్పు పెట్టిన మావోయిస్టులు తాజాగా గూడ్స్ రైలుని టార్గెట్ చేశారు. ఛత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును మావోయిస్టులు అడ్డగించారు. సుమారు 20 మంది సాయుధ నక్సలైట్లు రంగంలోకి దిగి గూడ్స్ రైలును నిలిపివేశారని, ఇంజిన్‌కు…
సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్న మత్స్యకారులు. అయితే, ఓ వర్గం నిబంధనల్ని తుంగలోకి తొక్కి చేపల్ని వేటాడుతోంది. దీంతో మరో వర్గం ఆకలితో అలమటిస్తోంది. ప్రకాశం జిల్లాలో తమిళనాడు మత్స్యకారుల దోపిడీ హాట్ టాపిక్ అవుతోంది. ప్రకాశం జిల్లా మత్స్యకారులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమిళనాడు నుంచి వస్తున్న మెకనైజ్డ్ బోట్లు మత్స్య సంపదను దోచుకుపోతుండడంతో ఆకలితో అలమటిస్తున్నారు స్థానిక జాలర్లు. కడుపు కాలి ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే వలల్ని, బోట్లను ధ్వంసం చేస్తున్నారు. భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు…
ఉత్తరప్రదేశ్‌లోని లకీంపూర్ కేర్ దాడిలో చనిపోయిన రైతుల చితాభస్మాన్ని ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి తీసుకువచ్చారు రైతు సంఘాల నాయకులు శ్రీనివాసరావు, గపూర్. గన్నవరం విమానాశ్రయంలో చితాభస్మాన్ని తీసుకువచ్చిన రైతులకు స్వాగతం పలికారు మాజీ మంత్రి వడ్డే శోభనద్రీశ్వరరావు, ఇతర రైతు సంఘాల నాయకులు. లకీంపూర్ కేర్ దాడి చేసిన కేంద్ర సహాయ మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాని వెంటనే చట్ట ప్రకారం శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి అజయ్ మిశ్రాని బర్తరఫ్ చేయాలని…