బంగ్లాదేశ్‌లో మతపరమైన హింస కొనసాగుతూనే ఉన్నది. చిట్టగాంగ్ డివిజన్‌లోని కుమిల్లాలో దుర్గాపూజ సందర్భంగా వేదిక వద్ద కొంతమంది వ్యక్తులు చేసిన మత దూషణ కారణంగా హిందూ దేవాలయాలపై దాడులు మొదలయ్యాయి. ఈ దాడుల అంశం సోషల్ మీడియాలో పోస్ట్ కావడంతో దేశ వ్యాప్తంగా హిందూ దేవాలయాలపైనా, హిందువుల ఇళ్లపైనా దాడులు జరుగుతున్నాయి. తాజాగా రాజధాని ఢాకాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాజిపారాలో గ్రామంలో హిందూవులకు చెందిన 29 ఇళ్లను తగలబెట్టారు. గ్రామంలోని 20 గడ్డివాములకు సైతం…
కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కోరలు చాస్తూనే ఉన్నది. అమెరికాతో పాటుగా అటు ఆస్ట్రేలియాలో కూడా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు పెద్ద సంఖ్యలో పెరిగిపోతుండటంతో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేసింది ప్రభుత్వం. విక్టోరియా, న్యూసౌత్‌వేల్స్‌లో కేసులు పెరుగుతుండటంతో వ్యాక్సిన్‌ను తప్పనిసరి చేశారు. నిర్మాణ కార్మికులు కనీసం ఒక్క డోసు తప్పనిసరిగా తీసుకోవాలని, వ్యాక్సిన్ తీసుకున్న వారినే నిర్మాణ పనులకు హాజరుకావాలని ఆదేశించింది. దీనిని కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు. వందలాది మంది నిర్మాణకార్మికులు మెల్‌బోర్న్ రోడ్లపైకి…