జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామాల్లో తెలంగాణ టాప్‌లో నిలిచింది.. టాప్‌లో నిలవడం అంటే.. ఒక్క స్థానం కాదు.. అందులో ఉన్న పదకి పది స్థానాలు కొల్లగొట్టింది.. గతంలోనూ ఈ జాబితాలో టాప్ 10లో ఆరు, ఏడు స్థానాలు దక్కించుకున్న సందర్భాలు ఉండగా.. ఈ సారి ఏకంగా టాప్ 10 మొత్తం తెలంగాణ గ్రామాలే కావడం విశేషం.. తాజాగా కేంద్రం విడుదల చేసిన సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన (ఎస్‌ఏజీవై) జాబితాలో పదింటిలో 10 గ్రామాలూ తెలంగాణ రాష్ట్రం…
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది సింగరేణి కాలరీస్ సంస్థ. ఏటా ఉద్యోగుల విషయంలో తీసుకునే శ్రద్ధతో పాటు సామాజిక బాధ్యతలోనూ సింగరేణి ముందుంది. తాజాగా సింగరేణి సిగలో మరో పురస్కారం వచ్చి చేరింది. సింగరేణి సంస్థను మరో ప్రతిష్ఠాత్మక అవార్డు వరించింది. అంతర్జాతీయ సంస్థ.. ఎనర్జీ ఎన్విరాన్‌మెంట్ ఫౌండేషన్ ద్వారా ప్లాటినం కేటగిరిలో అత్యుత్తమ సీఎస్‌ఆర్ సేవలందిస్తున్నందుకు గుర్తింపుగా గ్లోబల్ సీఎస్‌ఆర్ అవార్డు లభించింది. పర్యావరణ పరిరక్షణకు సింగరేణి సంస్థ అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. అందులో భాగంగా సోలార్…
కరోనా మహమ్మారి మరోసారి పల్లెలను టెన్షన్ పెడుతోంది.. ముఖ్యంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు మళ్లీ మహరాష్ట్ర టెన్షన్ పట్టుకుంది.. దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కరోనా కేసులు అక్కడే నమోదు అవుతుండగా.. దాన్ని ఆనుకోని ఉన్న తెలంగాణ జిల్లాలైనా ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం జిల్లాతోపాటు మంచిర్యాల జిల్లాకు కరోనా భయం పట్టిపీడిస్తుంది.. మరి ముఖ్యంగా మహారాష్ట్రలో రోజుకు వేలకు పైగా కరోనా కొత్తకేసులు నమోదు అవుతుండగా అక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ సరిహద్దు పంచుకున్న యవత్మాల్ జిల్లా,…
తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఇతోధికంగా సాయం అందిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు పథకం ద్వారా నిధులు ఇస్తోంది. రైతుల ఆత్మ బంధువుగా చేపట్టిన రైతు బంధు పథకం విజయవంతంగా అమలు అవుతోందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 63 లక్షల తెలంగాణ రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు జమ అవుతున్నాయి. దీంతో వ్యవసాయం కోసం అప్సులు తెచ్చుకునే బాధ చాలామటుకు తప్పుతోంది. తెలంగాణ వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఈ సంక్రాంతి వరకు జరుపుకోవాలని…
మనిషి భవిష్యత్తులో భూమి మీద నుంచి చంద్రునిమీదకు, అంగారకుని మీదకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందా అనే ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రుని వాతారవణంలోని పరిస్థితులు ఎలా ఉన్నాయి. అక్కడ మానవుని నివాసానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనే అంశాలను దృష్టిలో పెట్టుకొని పరిశోధనలు చేశారు. చంద్రునిపైన, మార్స్ పైనా ఘనీభవించిన మంచు జాడలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగోన్నారు. Read: మరో రికార్డ్ సృష్టించిన…
క్లీన్ ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా క్లాప్ కార్యక్రమం కింద ఇప్పటివరకూ చేపట్టిన కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించారు ఏపీ సీఎం జగన్. నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేయాలన్నారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలన్నారు. కొత్తగా వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను అందుబాటులోకి తీసుకురావాలని, ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను వీలైనంత త్వరగా తెప్పించుకోవాలన్నారు. గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నుంచి సమీప ఇళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు గార్బేజ్‌ను తొలగించడమే…
కోవిడ్ థర్డ్ వేవ్ కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రణాళిక… అలాగే చిన్న పిల్లలకు సంబంధించి వ్యాక్సినేషన్ ప్రణాళిక సమర్పించాలి అని టీఎస్ హైకోర్టు తెలిపింది. అయితే మహారాష్ట్రలో లో ఉన్న పరిస్థితులు తెలంగాణ లేవు. కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సంక్షేమం, రక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలు సమర్పించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం అందజేస్తున్న కిట్ లలో స్టెరాయిడ్స్ లేకుండా చూసుకోవాలి…