ఏపీలో జగన్ అధికారం చేపట్టాక వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి, దీంతో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పై సీఎం వైయస్.జగన్ సమీక్ష చేపట్టారు. నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాల పర్యవేక్షణ, సమస్యల సత్వర పరిష్కారం పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీని కోసం ప్రత్యేక యాప్ రూపకల్పన చేశారు. ‘‘ఏపీ సీఎం ఎంఎస్’’ (ఏపీ కన్‌సిస్టెంట్ మానిటరింగ్ ఆఫ్ మున్సిపల్ సర్వీసెస్) యాప్‌తో రియల్‌టైం మానిటరింగ్ సాధ్యం కానుంది. మరో నెల రోజుల్లో సిద్ధం యాప్ సిద్ధం కానుంది.
రాష్ట్రంలోని 4,119 వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక సదుపాయాల పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయడానికి దీని ద్వారా సాధ్యం అవుతుంది. వార్డు సెక్రటరీలు తమ పరిధిలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకూ తనిఖీలు చేపడతారు. తమ పరిధిలోని సుమారు 6–7 కి.మీ. మేర రోడ్లపై నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు చేస్తారు. సమస్య ఉంటే వెంటనే ఫోటో తీసి యాప్ ద్వారా అప్‌లోడ్ చేసే అవకాశం వుంటుంది. గుర్తించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు పౌరులకూ ఫోటోలు అప్‌లోడ్ చేసే అవకాశం కల్పించనున్నారు.
పట్టణాలు, నగరాల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా తమ దృష్టికి వచ్చిన అంశాలను యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్సించనున్నారు. ఈ సమస్యలు సంబంధిత విభాగాలకు చేరి అక్కడనుంచి పరిష్కారాలు లభిస్తాయి. వచ్చిన ప్రతి సమస్య పరిష్కారం పై మానిటరింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల్లో మంచి పురోగతి సాధ్యం అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారు. మున్సిపల్ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాల్లో తీసుకు వస్తున్న యాప్‌ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలి. నగరాల్లో, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాల్వలు సహా.. ఇతర మౌలిక సదుపాయాలు నిర్వహణ బాగుండాలన్నారు జగన్.
Read Also: Satyavathi Rathod : రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సబబు కాదు
ఇప్పుడు తీసుకొస్తున్న యాప్ ద్వారా వచ్చే గ్రీవెన్స్‌ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలి.వర్షాకాలం సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ అంశం పై కూడా దృష్టి పెట్టాలి. దీర్ఘకాలం మన్నే పద్ధతిలో రోడ్ల నిర్మాణం సాగేలా చూడాలి. టౌన్ ప్లానింగ్ సహా.. అన్ని విభాగాల్లో సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను పరిశీలన చేయండి. సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ల్ పై నిశిత సమీక్ష చేసి తగిన ప్రణాళికను రూపొందించాలన్నారు. రాజమండ్రిలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంటు నిర్మాణ ప్రతిపాదనకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 28 అర్భన్ లోకల్ బాడీస్‌ను కవర్ చేస్తూ ప్లాంట్ నిర్మాణం చేస్తారు. 7.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటవుతుంది.