ఎన్టీఆర్ జిల్లాలో కట్టలేరు వాగుకు మరోసారి పోటెత్తింది వరద ప్రవాహం.. గంపలగూడెం మండలం వినగడప - తోటమూల గ్రామాల మధ్య ఉన్న కట్టలేరు వాగుకు పోటెత్తిన వరదతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. గత రెండు వారాల క్రితం వచ్చిన భారీ వరదలకు గండ్లు పడ్డాయి.. మీటర్ల మేర కోతకు గురైంది తాత్కాలిక రహదారి.. ఇటీవలే రోడ్లు మరమ్మత్తుల అనంతరం రాకపోకలు పునః ప్రారంభమయ్యాయి.. కానీ, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రవాహంతో నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షాలు…
ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిని కలిసిన పార్వతీపురం మన్యం జిల్లా బోర్డర్ గ్రామాల గిరిజనులు.. మేం ఆంధ్రలోనే ఉంటాం అంటున్నారు.. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని వివాస్పద గ్రామాలైన నేరాళ్లవలస, దొర్ల తాడివలస, దూళిబంద్ర, ఎగవసెంబి, దిగువ సెంబీ, పణుకులోవ గూడాలకె చెందిన గిరిజనలు నేడు మాజీ డిప్యూటీ సీఎంను కలిశారు..
సంక్రాంతి పండుగ సంబరాలు పల్లెల్లో అంబరాన్ని తాకాయి.. మూడు రోజుల పాటు ఘనంగా జరిగిన భోగి, సంక్రాంతి, కనుమ పండగ ముగియడంతో.. తిరిగి పట్నం బాట పట్టారు జనం.. పండగకు ముందు హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే రహదారులు.. ముఖ్యంగా విజయవాడ హైవే రద్దీగా మారి.. ఎక్కడి కక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ కాగా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. పల్లెకు బైబై చెబుతూ పట్నం బాట పట్టారు..
Tummala Nageswara Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పూసుకుంట, కటుకూరు గ్రామాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి రాష్ట్ర వ్యవసాయ, చేనేత అనుబంధ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఆయన ఈ సందర్బంగా ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ జితిష్ వి పాటిల్, ఐటిడి పిఓ రాహుల్ తో కలిసి పూసుకుంట నుండి రాచన్నగూడెం బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. శనివారం పూసుకుంటకు చేరుకున్న…
పందాల పండుగకు రంగం సిద్దమవుతుంది. నెలల తరబడి చంటిబిడ్డల్లా సాకిన పందెం పుంజులను బరిలో దించేందుకు ముహూర్తం దగ్గర పడటంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి అతిధులు ఇప్పటికే గ్రామాలకు చేరుకుంటున్నారు.. వీరితో పాటు పందాలపై మోజున్న జూదగాళ్ళంతా గోదావరి బాట పట్టారు. పెద్ద మొత్తంలో పందేలు కాసేందుకు సై అంటే సై అంటున్నారు.. ఇదే సమయంలో కూటమి నేతల మద్య పందాల నిర్వాహణ పోటి పెంచుతోంది.…
ఏపీలో భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగుల్చాయి. మరోవైపు.. లంక గ్రామాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అల్లూరు జిల్లాలో వర్షాల జోరు తగ్గలేదు. దీంతో.. వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పోంగుతున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో భారీ వర్షాలకు లక్ష్మీపురం పంచాయితీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరి కొద్ది నెలల్లో రాష్ట్రంలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కొత్త ఇనిషియేటివ్.. పోలీసు అధికారుల పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Alluri District: కాలం మారిన.. టెక్నాలజీ పెరిగిన కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అభ్యుదయ సమాజంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ స్థాయిని చేరురుతున్న ఈ కాలంలో కూడా కొన్ని గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీస వైద్య సదుపాయాలు లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది అంటే ఆ ప్రాంతాలు అభివృద్ధికి ఎంత దూరంలో ఉన్నాయో ఆలోచించాలి. పూర్వకాలంలో కనీస వైద్య సదుపాయాలు లేక…