Alluri District: కాలం మారిన.. టెక్నాలజీ పెరిగిన కొన్ని ప్రాంతాలు మాత్రం అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. అభ్యుదయ సమాజంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ స్థాయిని చేరురుతున్న ఈ కాలంలో కూడా కొన్ని గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కనీస వైద్య సదుపాయాలు లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది అంటే ఆ ప్రాంతాలు అభివృద్ధికి ఎంత దూరంలో ఉన్నాయో ఆలోచించాలి. పూర్వకాలంలో కనీస వైద్య సదుపాయాలు లేక ప్రజలు ప్రాణాలతో పోరాడేవారు అని విన్నాం. అలాంటి ఘటనే ఇప్పుడు అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.
Read also:New Delhi : జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం
వివరాకలోకి వెళ్తే.. పెదబయలు మండలం ఇంజరి పంచాయితీ తూలంలో ఓ గర్భిణీకి వైద్య చికిత్స అందిచాల్సి వచ్చింది. గ్రామంలో కనీస వైద్య సదుపాయం లేదు. ఊరు దాటాలి అంటే మూడు కిలోమీటర్లు కాలినడకనే వెళ్ళాలి. ఈ నేపథ్యంలో ఆ గర్భిణీ బంధువులు ఆమెను ఒక డోలిలో ఉంచి మూడు కిలోమీటర్లు మోసుకుంటూ వెళ్లారు . ఈ ప్రయాణంలో ఆమె ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 40 కి.మీ ప్రయాణించి ఆ గర్భిణిని అతి కష్టం మీద జి.మాడుగుల ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఈ విషయం పైన స్థానిక గిరిజనులు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మా ఊర్లో సిగ్నల్ లేక మా సమస్య చెప్పుకోలేకపోయాము అని పేర్కొన్నారు. కాగా ఇటివల సమీప గ్రామంలో సెల్ టవర్ నిర్మాణం జరిగింది. ఈ నేపథ్యంలో గిరిజనులు వాళ్ళ కష్టాలను విడియో తీసి పంపుతున్నారు.