విజయవాడలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఐదుగురు రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా శనివారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెవర శ్రీను అలియాస్ పిల్ల శ్రీను, మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్ల బాలస్వామి అలియాస్ పండు, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని బానవతు శ్రీను నాయక్, అజిత్ సింగ్ నగర్ పరిధిలోని మల్లవరపు విజయ్ కుమార్ అలియాస్ మసలం,…
విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిని పొగాకు నిషేధిత ప్రాంతంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. ఈనెల 26 నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆలయ మెట్ల భాగం నుంచి కొండపై వరకు పొగాకు ఉత్పత్తులు నిషేధించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, భక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20 నుంచి 200 వరకు ఫైన్ వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో పొగాకు నిషేధిత సర్క్యులర్‌ను స్వయంగా…
గత రెండేళ్లుగా కోవిడ్ ప్రభావంతో ఆర్టీసీ గడ్డు కాలమే చూసింది.. అయితే, కోవిడ్ తగ్గుముఖం పట్టడం, ప్రయాణికులు ప్రజా రవాణా ఉపయోగించటంతో మళ్లీ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చినట్టు అయింది. తాజాగా పెళ్లిళ్ల సీజన్ రావటం, వేసవి సెలవులతో ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆర్టీసీలో ప్రయాణించే వారి సంఖ్య అధికమైంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా పరిధిలో అక్యుపెన్సి రేషియో సగటున 70 శాతానికి పైగా చేరుకుంది. ఏప్రిల్, మే నెలల్లో ఏసీ బస్సుల్లో అక్యూపెన్సీ రేషియో 80…
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతూనే వున్నాయి. భారత్ బంద్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. విశాఖపట్నం పరిధిలోని రైల్వే స్టేషన్ ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. సాయుధ బలగాల పహారా కొనసాగుతోంది. అనుమనితులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే అనుమతిస్తున్నారు. రైళ్ల రాకపోకలు యధాతథంగా జరుగుతున్నాయి. అగ్నిపథ్ అల్లర్ల నేపథ్యంలో వాల్తేర్ రైల్వేస్టేషన్ పరిసరాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. బైక్, కారు పార్కింగ్ అనుమతి నిరాకరించారు. అటు, పార్సిల్…
అగ్నిపథ్ స్కీంకి వ్యతిరేకంగా నిరుద్యోగ యువత హింసకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన విధ్వంసంపై అధికారులు తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం అయ్యారు. రైల్వే ఉన్నత అధికారులతో విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు. రైల్వే పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. పూర్తి పోలీస్ బందో బస్తుతో విశాఖ రైల్వే స్టేషన్ కొనసాగుతోంది. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ యువత కి విజ్ఞప్తి చేస్తున్నాం. హింసాత్మిక కార్యక్రమాలు ద్వారా దేన్ని…
విజయవాడలో సంచలనం కలిగించిన బాలిక కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్లో మూడు ఏళ్ల బాలికను మహిళా కిడ్నాపర్లు ఎత్తుకెళ్ళారు. కేసు దర్యాప్తు చేపట్టిన రైల్వే పోలీసులు బాలికను సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. డబ్బుల కోసం పాపను అమ్మకానికి పెట్టింది విజయవాడకు చెందిన లక్ష్మి, పాప తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో కిడ్నాప్ కు పన్నాగం పన్నింది. గుడివాడకు చెందిన విజయలక్ష్మి అనే ఆమెకు 25 వేలకు…
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని…
టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. భవానీపురంలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని భవానీ పురంలో ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి. మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, జోగి రమేష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఏడు స్థానాలు గెలిచి సీఎంకి బహుమతిగా ఇస్తామన్నారు వెల్లంపల్లి. 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించుకుంటాం. ఏడాది గడువులో…
విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్‌లో ఫుట్‌బాల్ ప్లేయర్ దారుణ హత్యకు గల కారణాలను పోలీసులు తెలిపారు. పక్కా స్కెచ్‌తోనే ప్రభాకర్ గ్యాంగ్ హత్య చేసిందని విజయవాడ డీసీపీ జాషువా మీడియాకు వెల్లడించారు. ఆకాష్ మర్డర్ కేసులో 11 మందిని నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వాంబే కాలనీలో రౌడీషీటర్ టోని అనే వ్యక్తి ఇటీవల ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. టోని అంత్యక్రియల సమయంలో ఆకాష్, ప్రభాకర్ గ్యాంగ్‌ల మధ్య వివాదం చోటుచేసుకుంది. టోని అంత్యక్రియల అనంతరం వీరంతా…