Bus Charges: చార్జీలు పెంచండి.. ఏపీఎస్ ఆర్టీసీకి టీఎస్ ఆర్టీసీ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గాడిలో పెట్టి.. లాభాల బాట పట్టించేందుకు టీఎస్ ఆర్టీసీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది… వినూత్న తరహాలో కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే.. మరోవైపు పెరిగిన డీజిల్ ధరలకు అనుగుణంగా సంస్థపై భారం పడకుండా చార్జీలను కూడా వడ్డిస్తోంది.. అయితే, ఇది ఏపీఎస్ ఆర్టీసీకి కలిసివచ్చినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.. టీఎస్ ఆర్టీసీ సర్వీసుల్లో చార్జీలు పెరడంతో.. ప్రయాణికులు క్రమంగా ఏపీ ఆర్టీసీ సర్వీసులను ఆశ్రయిస్తున్నారట.. దీంతో, ఏపీ-తెలంగాణ మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరింది టీఎస్ ఆర్టీసీ.. తెలంగాణలో ఆర్టీసీ రెండోసారి పెంచిన చార్జీలతో ఏపీ, తెలంగాణ మధ్య తిరిగే బస్సు సర్వీసు టికెట్ల రేట్లలో తేడా వచ్చింది.. అయితే, రెండు రాష్ట్రాల రవాణా సంస్థల మధ్య జరిగిన అంతర్‌రాష్ట్ర ఒప్పందం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య నడిపే సర్వీసుల్లో ఒకే విధమైన చార్జీలుండాలి.. దానికి అనుగుణంగా చార్జీలు పెంచాలని ఏపీఎస్ ఆర్టీసీని కోరింది టీఎస్ ఆర్టీసీ.
Read Also: COVID-19: మళ్లీ పెరుగుతోన్న కేసులు.. ఫోర్త్ వేవ్ తప్పదా..?
Also Read
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
- CM Chandrababu: పేదల సొంతింటి కల సాకారం.. 28,445 కుటుంబాలకు సీఎం గుడ్‌న్యూస్
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
కాగా, ఈ మధ్య ఏపీఎస్ ఆర్టీసీకి దూరప్రాంత సర్వీసులు లాభాలు తెచ్చిపెడుతున్నాయి.. తెలంగాణకు వెళ్లే దూర ప్రాంత సర్వీసులు ముఖ్యంగా హైదరాబాద్ సిటీ రూట్‌లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయిందట.. టీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు.. ఏపీఎస్ ఆర్టీసీ ఆదాయం పెరిగేందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.. నాలుగైదు రోజుల్లోనే అత్యధిక ఓఆర్ తో ఏపీఎస్ ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెరగడంతో.. ఆ రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు సైతం ఏపీ ఆర్టీసీ బస్సుల ఆశ్రయించడంతో.. ఆ సంస్థపై సిరులు కురిపిస్తోంది.. ఇక రిజర్వేషన్ సమస్యలు కూడా తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ నెల 9న టీఎస్ ఆర్టీసీ రెండోసారి భారీగా డీజిల్ సెస్ పెంచింది.. పల్లెవెలుగు సర్వీసుల నుంచి ఏసీ బస్సుల వరకు కిలో మీటర్ల వారీగా రూ.5 నుంచి రూ.170 వరకు పెంచేసింది.. దీంతో రెండు రాష్ట్రాల బస్సుల మధ్య చార్జీల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది.. ఇదే ఏపీ బస్సుల వైపు ప్రజలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా మారింది. ఇది గమనించిన టీఎస్ ఆర్టీసీ.. అంతరాష్ట్ర ఒప్పందాల ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య తిరిగే సర్వీసుల్లో చార్జీలు పెంచాలని కోరింది.
తాజావార్తలు
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్‌ను క్లీన్‌స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
-
SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..