తెలుగు దేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది.. పార్టీలోని విభేదాలు, ఎన్నికల్లో పోటీ విషయం ఇలా ఎన్నో సందర్భాల్లో అలకలు, బుజ్జగింపులుగా సాగుతూ వస్తోంది.. ఇప్పుడు కేశినేని ఫ్యామిలీలో చిచ్చు మొదలైంది.. టీడీపీ సీనియర్ నేత, ఎంపీ కేశినేని నాని తన సోదరుడైన కేశినేని చిన్నిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చగా మారింది.. తన పేరు, హోదాను అడ్డుపెట్టుకుని గుర్తు తెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని, నకిలీ వీఐపీ…
వైసీపీ ప్లీనరీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తికావొచ్చాయి.. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు సమావేశాలు సాగనున్నాయి..
విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనవాణి కార్యక్రమాన్ని జనసేన పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా అర్జీలను స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు పట్టించుకునే తీరిక పాలకులకు లేదని ఆరోపించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా తాము కృషి…
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనక దుర్గమ్మకు హైదరాబాద్‌లోని మహంకాళి జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 11 గంటలకు బంగారు బోనం సమర్పించనున్నారు. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమీటీ దుర్గమ్మకు బంగారు బోనంతో పాటు సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని మహంకాళి బోనాల ఉత్సవ కమిటీ ఛైర్మన్ రాకేష్ తివారీ వెల్లడించారు. మేళతాళాలతో , కోలాటాలతో, బేతాల వేషాలతో బ్రహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి…
చాలా కాలం తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా పార్టీ నేతలతో కలిసి టీడీడీ ఎంపీ కేశినేని నాని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్ని కుల క్షత్రియుల భవన నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీ కేశినేని నాని రూ. 65 లక్షలు కేటాయించారు. విజయవాడ ఆటో నగర్లో తమకున్న స్థలంలో అగ్నికుల క్షత్రియులు భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయించినందుకు ఎంపీ కేశినేని నానికి అగ్నికుల క్షత్రియులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ…
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఏపీలో జనసేన పార్టీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ‘జనవాణి’ పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీని ద్వారా సామాన్య ప్రజల నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా వచ్చే ఐదు ఆదివారాలు పవన్ ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి వారి నుంచి వివిధ అంశాలపై అర్జీలను స్వీకరిస్తారని జనసేన పార్టీ వెల్లడించింది. తొలివిడత జనవాణి కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలోని…