Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • CJI UU Lalit
  • Gorantla Madhav
  • Vice President Of India
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Andhra Pradesh News Vijaywada Durga Temple Announced As A Tobacco Prohibited Area

Vijayawada: దుర్గమ్మ భక్తులకు గమనిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.200 వరకు జరిమానా

Published Date :June 25, 2022
By Ramesh Nalam
Vijayawada: దుర్గమ్మ భక్తులకు గమనిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.200 వరకు జరిమానా

విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిని పొగాకు నిషేధిత ప్రాంతంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ప్రకటించారు. ఈనెల 26 నుంచి ఆలయ పరిసర ప్రాంతాల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఆలయ మెట్ల భాగం నుంచి కొండపై వరకు పొగాకు ఉత్పత్తులు నిషేధించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, భక్తులు నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.20 నుంచి 200 వరకు ఫైన్ వసూలు చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ఆలయ పరిసరాల్లో పొగాకు నిషేధిత సర్క్యులర్‌ను స్వయంగా చదివి ఉద్యోగులకు కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. నేషనల్ టొబాకో కంట్రోల్, కోట్పా 2003 చట్టంలో భాగంగా ఆలయ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు నిషేధించామన్నారు. ఇప్పటికే ఈ చట్టాన్ని తిరుమలలో అమలు చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు రెండో ఆలయంగా ఇంద్రకీలాద్రిపైనా అమలు చేస్తున్నామని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు, ఇక్కడ పనిచేసే ఉద్యోగులు ఆలయ పరిసరాల్లో పొగాకు ఉత్పత్తులు వాడకూడదని స్పష్టం చేశారు. ఈ చట్టం అమలుకు మీడియా సహకారం చాలా అవసరమని కలెక్టర్ ఢిల్లీ రావు అభిప్రాయపడ్డారు.

ఇంద్రకీలాద్రిపై పొగాకు నిషేధించిన విషయాన్ని కేంద్ర ప్రభుత్వం, WHOకు తెలియజేస్తామని కలెక్టర్ ఢిల్లీరావు వెల్లడించారు. భక్తులకు ఆన్ని విధాలుగా ఈ చట్టంపై ఆలయంలో అవగాహన కల్పిస్తామన్నారు. ఆలయ మెట్ల మార్గం, ఘాట్ రోడ్, కౌంటర్స్, క్యూ లైన్స్ లలో పొగాకు ఉత్పత్తులు నిషేధం అన్నారు. భక్తులకు ఈ విషయం తెలియచేయటం కోసం ఎఫ్ఏం రేడియో, డిజిటల్ మీడియా, కరపత్రాల ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. అటు భక్తులు, ఆలయ ఉద్యోగులందరికీ ఈ చట్టం వర్తిస్తుందని ఆలయ ఈవో భ్రమరాంబ ప్రకటించారు. ఇప్పటికే ఆలయ ఉద్యోగులకు అవగాహన కల్పించామని.. దీనికి అందరి సహకారం అవసరమన్నారు. కోవిడ్ కేసుల కారణంగా దుర్గా ఘాట్‌లో స్నానాలకు ఇప్పట్లో అనుమతి లేదని స్పష్టం చేశారు.

Andhra Pradesh: ఉద్యోగుల ప్రొబేషన్‌పై ప్రభుత్వం కీలక జీవో జారీ

  • Tags
  • collector dellirao
  • Durga Temple
  • indrakeeladri
  • Tobacco Prohibited Area
  • vijayawada

WEB STORIES

టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?

"టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?"

జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

"జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.."

Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం

"Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం"

జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?

"జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?"

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

CPI Mahasabhalu: అక్టోబర్ 14 నుంచి 18 వరకూ సీపీఐ జాతీయ మహాసభలు

Freight Corridor: డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌పై సర్వే

Kesineni Chinni Meets Vangaveeti Radha: వంగవీటి రాధాతో కేశినేని చిన్ని భేటీ..

Krishna Floods: గోదావరి శాంతించింది.. కృష్ణమ్మ పరుగులు పెడుతోంది

Kesineni Nani : టీడీపీలో మళ్లీ షరా మామూలుగానే నాని తీరు.. ఎక్కడ గ్యాప్ వచ్చింది?

తాజావార్తలు

  • Independence Day : అసెంబ్లీలో త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించిన స్పీకర్‌ పోచారం

  • PM Narendra Modi: ఆత్మ నిర్భర్ భారత్ అంటే ప్రభుత్వ పథకం కాదు..

  • Minister Roja Dance: హంసధ్వని పుస్తకావిష్కరణలో.. పాటకు స్టెప్పులేసిన మంత్రి

  • Mount Kilimanjaro : కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన సమాచార శాఖ ఉద్యోగి నితిన్

  • PM Narendra Modi: భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది

ట్రెండింగ్‌

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions