ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడుస్తోందా? టీడీపీ నేతల వరుస అరెస్ట్ లు దానికి సంకేతమా? అంటే అవుననే అనిపిస్తోంది. కడప, అనంతపురం పర్యటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ నేతల్ని వేధించడంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ శివారులో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. గొల్లపూడిలో టీడీపీ నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి చిన్నాను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం అర్ధరాత్రి చిన్నాని అరెస్ట్ చేసి వన్ టౌన్…
రాష్ట్రంలోని మహిళలందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లాలో దిశా యాప్ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఒకే రోజు రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకునేలా జిల్లా వ్యాప్తంగా దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ పై మాస్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దిశా యాప్ మెగా ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమీషనర్…
విజయవాడలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి.. డ్రగ్స్ కొరియర్ కేస్ చిక్కు ముడి విడకముందే నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించింది. నిందితుల నుండి 8 గ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.. నున్న పోలీస్ స్టేషన్ పరిధిలో పక్క ప్లాన్ తో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను అరెస్ట్ చేశారు కర్నూలు పోలీసులు.. మరో ముగ్గురూ పరారీ అయినట్టుగా చెబుతున్నారు.. ఎనర్జీ బూస్ట్‌లో ఉపయోగించే మెధాంఫిటమైన్ డ్రగ్ స్వాధీనం చేసుకున్నారు.. కర్నూల్ డ్రగ్స్ విక్రయాలతో విజయవాడ యువకుల…
బెజవాడలో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటా ధర ఏకంగా 70 రూపాయలకు చేరింది. రెండు నెలల క్రితం నగరంలో కేజీ టమాటా 10 రూపాయలు మాత్రమే. ఇప్పుడా ధర వంద రూపాయలకు చేరుకునేలా ఉంది. ఏ కూర వండినా అందులో టమాటా ఉండాల్సిందే. అలాంటి టమాటా ఇప్పుడు కొనాలంటేనే కరువైపోయింది. తుఫాన్‌తో పంట నష్టపోవటమే రేట్లు పెరగటానికి కారణం అంటున్నారు వ్యాపారులు. Read Also: IPS Pratap Reddy: బెంగళూరు సీపీగా ఏపీ సీనియర్ ఐపీఎస్.. మరోవైపు,…
విజయవాడలో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఆందోళనకు దిగారు. స్విగ్గీ సంస్థ పని గంటలు పెంచడంతో పాటు ఇన్సెంటివ్స్ తగ్గించడంతో డెలివరీ బాయ్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 50 శాతం ఇన్సెంటివ్స్ తగ్గించిన నేపథ్యంలో తమకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పెంచకుండా తగ్గించటం పట్ల స్విగ్గీ డెలివరీ బాయ్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పగలంతా కష్టపడినా తమకు రూ.270 మాత్రమే వస్తున్నాయని.. పెట్రోల్ ఇన్సెంటివ్ కూడా తొలగించారని డెలివరీ బాయ్స్ ఆరోపిస్తున్నారు. Read Also: Illegal Affairs: ఏపీలో మగాళ్లు…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన విజయవాడ ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. నిషేధిత ఎపిడ్రిన్ డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న అరుణాచలం ను ముందుగా కస్టడీకి తీసుకోనున్నారు బెజవాడ పోలీసులు. డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులతో సంయుక్తంగా నిందితులను పట్టుకునేందుకు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. అరుణాచలం ఇచ్చిన సమాచారం ఆధారంగా డ్రగ్స్ కేసులో కీలకంగా ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారని తెలుస్తోంది.…
నేడు రాజ్ భవన్ ను ముట్టడించేందుకు రాయలసీమ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో విజయవాడలో పోలీసులు బందోబస్తు ముమ్మరం చేశారు. ఛలో రాజ్ భవన్ నిరసనకు రాయలసీమ జిల్లాలనుంచి విద్యార్ధులు తరలివస్తున్నారు. ఈ ఆందోళనకు అనుమతులు లేవు ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తాం అంటూ సీపీ హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్ లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్యర్యంలో నిరసనకు అన్ని ఏర్పాట్లు చేశారు. కర్నూల్ రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ అనంద్ రావు నీ రీకాల్…
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది.. 2011లో చింతమనేనిపై నమోదైన కేసును కొట్టివేసింది ప్రజా ప్రతినిధుల కోర్టు.. మహిళపై దాడి చేశారంటూ 2011లో చింతమనేని ప్రభాకర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే కాగా.. అయితే, అక్రమంగా కేసు నమోదు చేశారని చింతమనేని తరపు న్యాయవాదులు కోర్టు ముందు వాదనలు వినిపించారు.. ఇక, ఈ కేసులో సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కేసును కొట్టివేసింది ప్రజా ప్రతినిధుల…
విజయవాడలో పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్డులో ఆప్కో ఎగ్జిబిషన్ షోరూంను పర్యాటక శాఖ మంత్రి రోజా గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆప్కో షోరూంలో వస్త్రాలను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. సమ్మర్ శారీ మేళాకు తనను పిలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మహిళలకు నచ్చేలా అన్నీ ఆప్కో షోరూంలలో ఉన్నాయన్నారు. ప్రజలు కూడా ఆప్కో షోరూంలలో కొనుగోలు చేస్తూ ఆప్కో అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. చేనేత కార్మికులకు మనం సహాయం చేస్తేనే వాళ్లు అభివృద్ధి…
బంగారం మెరిసింది. వెండి వెలవెలబోయింది. మంగళవారం మార్కెట్లలో బంగారం, వెండి ధరలు అస్థిరంగా నమోదయ్యాయి. మార్కెట్లలో బంగారం ధర పెరగగా.. వెండి ధర తగ్గింది. హైదరాబాద్, విజయవాడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ వరకు ఇదే ట్రెండ్ నమోదైంది. చెన్నైలో మాత్రం బంగారం, వెండి రెండు ధరలూ తగ్గి అక్కడి కొనుగోలుదారులకు శుభవార్తగా నిలిచాయి. పెరుగుతోన్న బాండ్ ఈల్డ్స్.. అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలపై ఒత్తిళ్లకు దారితీస్తుందని విశ్లేషకులంటున్నారు. అంతర్జాతీయంగా నమోదవుతోన్న ధరల ప్రభావం కూడా దేశీయంగా…