హైదరాబాద్లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో జరిగిన ఓ దారుణ ఘటన సామాన్యులను కలవరపెడుతోంది. సంతానం కోసం ఆశతో వచ్చిన దంపతులను మోసం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లను గోపాలపురం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు.…
Kota Srinivasa Rao Tribute Meeting in Vijayawada: విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు బహుముఖ ప్రజ్ఞశాలి అని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రశంసించారు. బీజేపీ సిద్ధాంతాలని చాటి చెప్పి.. పాటించిన వ్యక్తి అని పేర్కొన్నారు. కొన్ని సినిమాల్లో హిందుత్వాన్ని తప్పుగా చూపిస్తే ప్రతి ఘటించారనని చెప్పారు. తెలుగు వారిని, తెలుగు సినిమా కాపాడడానికి కోట ఎప్పుడూ ముందు ఉన్నారని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ చెప్పుకొచ్చారు. పద్మశ్రీ కోట శ్రీనివాసరావుకి హోటల్…
విజయవాడ వర్షాల కారణంగా మళ్లీ బుడమేరు పొంగుతుంది.. అని సోషల్ మీడియా పోస్టులతో కొంతమంది హల్చల్ చేస్తున్నారు.. దీంతో, వర్షాలు పెరిగితే మళ్లీ బుడమేరు కట్ట తెగి.. మళ్లీ వరదలు వస్తాయి అని విజయవాడ వైస్సార్ కాలనీ వాసులు భయపడుతున్నారు. అయితే, సోషల్ మీడియాలో జరుగోతన్న ఈ తప్పుడు ప్రచారాన్ని కొట్టిపారేశారు పోలీసులు..
Investopia Global-AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టోపియా గ్లోబల్- ఏపీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సు విజయవాడలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది.
విజయవాడలో పట్టపగలే.. నగర నడిబొడ్డున ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు.. రక్తపు మడుగులో పడి ఉన్న రెండు మృతదేహాలు చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.. కత్తితో పొడిచి హత్య చేసినట్టుగా భావిస్తున్నారు పోలీసులు.. అయితే, హత్య జరిగిన రోడ్డు నుంచి ఓ యువకుడు పరారైనట్టు గుర్తించారు పోలీసులు..
Vijayawada: విజయవాడలో పబ్ల పేరుతో యువత రాత్రిళ్లు నానా రచ్చ చేస్తుండటంపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రముఖ పబ్లో అర్ధరాత్రి 2 గంటలు దాటిన తరువాత కూడా పార్టీలు కొనసాగుతున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు, అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు.
Marriage Fraud: బెజవాడలో నిత్య పెళ్లి కూతురు అను ఆగడాలపై పోలీసులు విచారణ చేపట్టారు. నగరంలో పబ్స్ వేదికగా అక్కడకు వచ్చే వారిని టార్గెట్ చేసుకుని అను ఈ పెళ్లిళ్ల మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
Venkaih Naidu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాస్ రావు మరణం విచారకరం అన్నారు. కోట శ్రీనివాస్ గొప్ప మానవతావాది. అంతకు మించిన గొప్ప నటుడు. విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన సినిమాలలో కనిపిస్తే హాస్యం పండుతుంది. బిజెపి లో చేరి విజయవాడ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో సేవలు చేశారు. ఆయన కుమారుడి మరణం ఆయన జీవితాన్ని…
విజయవాడలో రిటైర్డ్ ఇంజినీర్ను దారుణంగా హత్య చేశారు. ఇంట్లో పని మనిషే మాటు వేసి చంపేసింది. వృద్ధులు ఉన్నారని ప్లాన్ చేసి మరీ హత్య చేసింది. బంగారం, డబ్బుతో ఉడాయించింది. నగరం నడిబొడ్డున జరిగిన ఈ హత్య బెజవాడలో కలకలం సృష్టిస్తోంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు వెంకట రామారావు. రోడ్లు భవనాల శాఖలో ఇంజినీర్గా పని చేసి రిటైరయ్యారు. ప్రస్తుతం విజయవాడ NTR కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈయనతో పాటు ఆ ఇంట్లో తల్లి…