Nimmala Ramanaidu: రాష్ట్రంలో నేరస్తులు రాజకీయ ముసుగులో పార్టీని నడుపుతున్నారు అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ప్రతిపక్ష హోదా కూడా రాని పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని విమర్శించారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా అసత్య ప్రసారం చేస్తుంది.. ప్రజల్లో భయాందోళన సృష్టించడానికే వైసీపీ పని చేస్తుంది.. అమరావతి కొట్టుకుపోతుందని బెజవాడ మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మంత్రి నిమ్మల ఆరోపించారు.
Read Also: CP Radhakrishnan: ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ నామినేషన్.. మోడీ హాజరు
అయితే, ఇదే అభివృద్ధి కొనసాగితే వైసీపీ ఉనికి ఉండదనే ఆందోళనలో ఉన్నారని నిమ్మల రామానాయుడు చెప్పుకొచ్చారు. రాయలసీమలో రిజర్వాయర్లు కలకలాడుతున్నాయి.. చంద్రబాబు సారథ్యంలో వాటర్ మేనేజ్మెంట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ తో సుపరిపాలన ఇస్తున్నాం.. భారతీయుల పండుగ ఆగస్టు 15వ తేదీన జాతీయ జెండాను కూడా ఎగరవేయని మనస్తత్వం ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. బెట్టింగ్ రాయుళ్లకి, గంజాయి రాయుళ్లను పరామర్శించడానికి ఆయనకి సమయం ఉంది.. కానీ, ఆగస్టు 15వ తేదీన గుర్తులేదు అని మంత్రి రామానాయుడు మండిపడ్డారు.