ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు సిద్ధమవుతోంది.. అయితే, దసరా మహోత్సవాలకు హాజరు కావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఆహ్వానించారు దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు.
2025 దసరా సందర్భంగా ‘సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ’ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు హీరోయిన్ సంయుక్త మీనన్ హాజరయ్యారు. ‘విజయవాడ అందమైన సిటీ. విరూపాక్ష సినిమా రిలీజ్ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. విజయవాడ ఉత్సవ్ ఒక విజన్‌తో చేస్తున్నారు. ప్రజలందరి మద్దతుతోనే విజయవాడ ఉత్సవ్ సక్సెస్ అవుతుంది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 2 వరకూ…
మన ప్రాంతాలలో తయారయ్యే ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి.. మళ్లీ దేశ వ్యాప్తంగా స్వదేశీ ఉద్యమం ప్రారంభం కావాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్..
బెజవాడ దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను విజయవంతంగా నిర్వహించడంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దసరా మహోత్సవాల ప్రణాళికలు, భక్తుల రద్దీ నిర్వహణ, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, త్రాగునీరు, వైద్య సహాయం, శానిటేషన్ వంటి అంశాలను మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్షించారు.
వంగవీటి రాధాకృష్ణ అలియాస్ వంగవీటి రాధా ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌తో సమావేశం కాబోతున్నారు.. 11 నెలల తర్వాత నారా లోకేష్, వంగవీటి రాధా భేటీ జరుగుతోన్న నేపథ్యంలో.. విషయం ఏమై ఉంటుంది? అనే చర్చ ఆసక్తికరంగా మారింది.
గత వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. గత ప్రభుత్వం ఆగడాలతో ఐదేళ్ల పాటు జనాలు సరిగా గణేష్ ఉత్సవాలు కూడా జరుపుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 నుంచి 2024 వరకు డూండీ గణేష్ ఉత్సవాలు జరగనివ్వకుండా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. వినాయకుడు అంటే తమషా కాదు అని.. వడ్డీతో సహా వసూలు చేస్తాడు అని వార్నింగ్ ఇచ్చారు. డూండీ గణేష్ సేవాసమితి ఆధ్వర్యంలో సితార సెంటర్లో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి…
CM Chandrababu Visits 72 ft Ganesh idol in Vijayawada: బెజవాడలో డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల కార్యసిద్ధి మహాగణపతి మట్టి విగ్రహంను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పారు. భవిత్యత్తులో ఏపీకి ఏ ఇబ్బందులు రాకుండా తొలగిపోవాలని వినాయకుడిని కోరుకున్నానని తెలిపారు. ఏపీ ప్రజలు…
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో నేటి నుంచి కఠిన నిబంధనలు అమల్లోకి వచ్చాయి. దర్శనానికి వచ్చేవారికి సాంప్రదాయ దుస్తులు లేకుంటే ఆలయంలోకి అనుమతించరు.. అమ్మవారి ఆలయంలో సెల్‌ఫోన్ వాడకంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. వరలక్ష్మి నగర్లో ఇంటింటికీ వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీషా.. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో పండుగ వాతావరంలో స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ జరుగుతుందన్నారు.. రేషన్ పంపిణీలో అక్రమాలు అరికట్టడానికి స్మార్ట్ కార్డులు అందుబాటులోకి తెచ్చాం.. స్మార్ట్ కార్డ్స్ వల్ల ఉన్నతస్థాయిలో మానిటరింగ్ జరుగుతుందని వెల్లడించారు..