YSRCP: కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతోన్న వేళ.. దాడులు వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, రాజ్ భవన్‌లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వైసీపీ నేతల బృందం.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు.. గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసినవారిలో శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, కల్పలతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు..
Read Also: CM Revanth Reddy: కేసీఆర్ అరెస్ట్‌పై క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్.. ఎంత పెద్ద మాట అన్నారు సార్…!
ఇక, ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యాలపై గవర్నర్ దృష్టికి తెచ్చాం.. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడి ఘటనలను వివరించాం.. రమేష్ యాదవ్ పై విచక్షణా రహితంగా దాడి చేసి మట్టుపెట్టే ప్రయత్నం చేశారు.. గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా..? అని ప్రశ్నించారు.. అయితే, దాడులకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరాం అన్నారు.. గ్రామంలో పోలీసులు ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే దాడి జరిగిందన్నారు.. కర్నూలు డీఐజీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన భాష చూస్తుంటే పోలీసులు ఎలా ఉన్నారో అర్థం అవుతుందన్న ఆయన.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టాలి.. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని కోరాం.. గవర్నర్ అన్ని విషయాలు విని సానుకూలంగా స్పందించారని తెలిపారు.
Read Also: Gas Cylinder Blast: విశాఖలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..!
ఎన్నికల సందర్భంగా జరిగిన పలు పరిణామాలు ఇప్పటికీ ఎన్నికల కమిషన్‌కి కూడా ఫిర్యాదు చేశాం.. రాష్ట్రంలో ఎక్కడా పోలీసుల పర్యవేక్షణ లేదు అన్నారు బొత్స.. డీఐజీ మాట్లాడిన మాటలకు నిజంగా పోలీస్ సంఘం రియాక్ట్ అవ్వాలి.. అధికారం ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి.. పగలు, రాత్రి ఉన్నట్లే అధికారం కూడా మారుతూ ఉంటుంది.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై విచక్షణా రహితంగా దాడి చేయటం సమంజసమేనా..? అని ప్రశ్నించారు. ఇలా చేస్తే వైసీపీ చేతులు ముడుచుకుని కూర్చుంటుంది అనుకుంటున్నారా..? వాళ్లవైపు నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదంటే కూటమి వాళ్లు చేసినట్లు ఒప్పుకున్నట్లే కదా..? అని నిలదీశారు.. జడ్పీటీసీ ఎన్నికలు బాయ్ కాట్ చేసే పనైతే నామినేషన్లు ఎందుకు వేస్తాం..? ఏం జరిగిందని అందరూ చూసారు.. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పనులు తగదు.. లాస్ట్ ఎన్నికల్లో ఈవీఎంలు మేనేజ్ చేసుకుని గెలిచారు కదా..? ఇప్పుడు ఎన్నికల్లో నిజాయితీగా గెలవాలని సవాల్ చేశారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ..