ఇందిరాగాంధీ మెడలు వంచి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు.. అది ప్రజాస్వామ్య విజయం అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌కు మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు.. ప్రజాస్వామ్యవాదులతో కలిసి 30 రోజులు పోరాటం చేసి ఎన్టీఆర్ విజయం సాధించారు.. ఇందిరా గాంధీ మెడలు వచ్చారని పేర్కొన్నారు..
విజయవాడ కనక దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరిగిందని, వచ్చే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి పనులు చేపడుతాం అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని చెప్పారు. విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం అని.. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్‌కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం అని పేర్కొన్నారు. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్‌కి 1500 కోట్లతో టెండర్లను…
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు ఇచ్చింది. బుధవారం విచారణకు హాజరు కావాలని సూచించింది సిట్
Vijayawada: ఈ మధ్యకాలంలో ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించే వారి సంఖ్య రోజురోజుకు తిరుగుతోంది. ప్రజలకు మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి దొరికినంత దోచేసుకొని వెళ్లే వ్యక్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. రాష్ట్ర వ్యాపార రాజధానిగా పేరు పొందిన విజయవాడలో ఒక ఘరానా మోసం బయటపడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. Read Also:ENG vs IND: అబ్బో.. జస్ప్రీత్ బుమ్రాతో చాలా కష్టం: బెన్ డకెట్ విజయవాడలోని వన్ టౌన్ శివాలయం…
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో జూన్ 26 నుంచి జూలై 4వ తారీకు వరకు ‘వారాహి నవరాత్రులు’ నిర్వహించనున్నారు. విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరి దేవస్థానంలో అమ్మవారి ఆషాడ మాస సారె సమర్పణ ఉత్సవాలు నిర్వహించనున్నారు. మహా మండపంలోని ఆరవంతస్తులో అమ్మవారి ఉత్సవం మూర్తిని ప్రతిష్టించి పూజాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆషాడ సారె సమర్పణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లపై ఈవోతో ఆలయ వైదిక కమిటీ, అర్చకులు చర్చించారు. వారాహి అమ్మవారి నవరాత్రులు, ఆషాడం మాస…
సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసింది.. దీంతో, తుది నివేదికను సీల్డ్ కవర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు సీబీఐ అధికారులు.. ఇక, ఈ కేసు విచారణ సందర్భంగా.. సీబీఐ కోర్టులోనూ ఆయేషా మీరా కేసుకు సంబంధించిన నివేదిక కాపీని అందించాలని.. సీబీఐ అధికారులను ఆదేశించింది హైకోర్టు.. మరోవైపు, ఈ కేసులో తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు హైకోర్టు న్యాయమూర్తి..
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్ చల్ చేశారు.. ఏపీలో సంచలంగా మారిన లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కోర్టులో హాజరుపర్చే ముందు.. విజయవాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు.. ఈ సందర్భంగా నాపై తప్పుడు కేసులు పెడుతున్నారు అంటూ చెవిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయం సిట్ అధికారులకు కూడా తెలుసు.. ఇది మంచి పద్దతి కాదు.. నాకు నోటీసు…
ఇరాన్‌తో మన దేశానికి ఆర్ధిక సంబంధాలు ఉన్నాయి.. కానీ, ఇజ్రాయిల్ కి భారత్ మద్దతు ఇస్తోంది.. ఇదీ దారుణం అన్నారు సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు.
భర్త దౌర్జన్యకాండతో విసిగి పోయానని ఇంట్లో అన్ని వస్తువులు ధ్వంసం చేశాడని, తనను రక్షించాలని ప్రాథేయపడుతూ ఈనెల ఎనిమిదో తేదీన పూర్ణానందం పేటకి చెందిన ఓ బాధితురాలు 112 కి ఫోన్ చేసింది. ఆ కాల్ రిసీవ్ చేసుకున్న 112 సిబ్బంది, సమాచారం సేకరించి సత్యనారాయణపురం నుంచి ఓ పోలీస్ కానిస్టేబుల్, ఒక హోంగార్డు సంఘటన స్థలానికి పంపింది. బాధితురాలు తన ఇంట్లో వస్తువులు ధ్వంసం చేసిన తీరును పోలీసులకు క్షుణ్ణంగా వివరించింది. తనను రక్షించాలని తీవ్ర…
విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ రోజు విజయవాడ, విశాఖపట్నం సహా రాష్ట్రంలోని వివిధ విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ నగరాలకు, అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ విషయంలోనూ శ్రద్ధ పెట్టాలని సీఎం సూచించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం (గన్నవరం ఎయిర్పోర్ట్) టెర్మినల్ భవనాల నిర్మాణ పురోగతిపై ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..