Vijayawada : హృదయవిదారకం.. కన్నకొడుకుకు తల కొరివిపెట్టిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నవమాసాలు మోసి కని ఆలనా పాలనా చూసిన తల్లి తాను చనిపోతే తలకొరివి పెడతాడు అనుకుంటుంది.. కానీ కని పెంచిన చేతులతో కొరివి పెట్టాల్సిన పరిస్థితి వస్తే ఆ తల్లికి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. ఆమె భాధ వర్ణనాతీతం అనే చెప్పాలి.. అలాంటి హృదయవిదారక ఘటన ఒకటి వెలుగు చూసింది.. వయస్సు అయిన తల్లి తన కొడుకుకు తలకొరివి పెట్టిన ఘటన అందరిని కలచివేసింది.. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది.. కన్న కొడుకుకు తల్లి తలకొరివి పెట్టిన హృదయవిదారక ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో కొడుకు చనిపోగా వృద్దురాలైన ఆ తల్లి కన్నీటిని దిగమింగుకుంటూ అన్నీ తానయి అంత్యక్రియలు నిర్వహించింది..
వివరాల్లోకి వెళితే.. ఈ హృదయవిదారక ఘటన కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మెరకనపల్లి గ్రామానికి చెందిన పామర్తి ప్రసాద్ కు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. ఇటీవల అతడు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో బ్రతికించుకోడానికి ఆ కుటుంబం లక్షలు ఖర్చుచేసుకుని హాస్పిటల్స్ కు తిప్పారు. అయినా ఫలితం లేకుండా అతడు మరణించాడు. అయితే అతడికి కొడుకులు లేకపోవడంతో కన్నతల్లే తలకొరివి పెట్టింది..
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
- Quba Pub Fight: విశాఖ 'క్యూబా' పబ్‌లో రచ్చరచ్చ.. డ్యాన్స్ వివాదంతో మొదలై రోడ్డుపైకి చేరిన రగడ..
- Smart Roads: వాహనదారులకు శుభవార్త.. అమరావతిలో సరికొత్త స్మార్ట్ రోడ్లు.. ఈ ప్రాంతాల్లో..
తన చేత్తో అన్నం కలిపి పెట్టిన తల్లికి తల కొరివి పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని అక్కడున్న వారంతా కన్నీళ్లు పెట్టుకున్నారు.. ఇక ఆ తల్లి కొడుకు మృతదేహం వద్ద వృద్దురాలు పామర్తి ఝాన్సీ కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది. తనకు తలకొరివి పెట్టాల్సిన వాడికి తానే తలకొరివి పెట్టాల్సి వస్తోందంటూ ఆ తల్లి కన్నీరు పెట్టుకుంది. అన్నీ తానే అయి కొడుకు అంత్యక్రియలు నిర్వహించి ఆ తల్లే తలకొరివి పెట్టింది. బంధువులు, గ్రామస్తులు ఎంత ఓదార్చినా ఈ వయసులో కొడుకును కోల్పోయిన ఆ తల్లి బాధ ఇప్పట్లో తగ్గేది కాదు.. ఆమెకు ఆ దేవుడు ధైర్యం ఇవ్వాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు..
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!