ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరును పెంచారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.. విద్యకు పెద్దపీట వేసి నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు కేశినేని శ్వేతా.
Suryapet Road Accident: ఇటీవల తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో అనేకమంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్న సంగతి మనం మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాం. ఇక తాజాగా ఓ కార్ యాక్సిడెంట్ సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో చోటుచేసుకుంది. సోమవారం ఉదయం నాడు ముకుందాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ కారు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు ప్రమాద సంఘటనస్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. కారు స్పీడ్ కి అక్కడే ఆగి ఉన్న కంటైనర్ కిందికి వేగంగా దూసుకెళ్లింది. దాంతో భార్యాభర్తలిద్దరూ…
సీఎం జగన్ను చంపడానికే రాయి విసిరారని రిమాండ్ రిపోర్టులో కూడా రాసేశారు. దీంతో.. ఇప్పుడు ఈ వ్యవహారం అటు తిరిగి.. ఇటు తిరిగి తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోననే ఆందోళన టీడీపీ వర్గాల్లో పెరుగుతోందట. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అంటే మామూలు విషయం కాదు. మొన్నటి వరకు నిందితుడి ఎవరో తెలీదు.. ఎవరో రాయి విసిరారు.. అది కూడా సరిగా కన్పించ లేదు... ఇదంతా ట్రాష్.. ఒట్టి డ్రామా అని కొట్టిపారేసిన టీడీపీ నేతల్లో..…
విజయవాడలో ఏపీ సీఎం వైఎస్ జగన్పై రాయి దాడి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సతీష్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు బెజవాడ పోలీసులు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.. ఇక, రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు పేర్కొన్నారు పోలీసులు.. సీఎంను హత్య చేశాలన్న ఉద్దేశ్యంతోనే దాడి చేశారని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ కేసులో మరిన్ని కీలక అంశాలను బయటపెట్టారు.