Suryapet Road Accident: ఇటీవల తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కొందరు లారీ డ్రైవర్లు కూడా రెడ్ లైట్లు, సైడ్ ఇండికేటర్లు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వాహనాలను రోడ్డుపైనే పార్క్ చేస్తున్నారు. అతివేగంగా వెళ్లేవారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్షణికావేశంలో ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాంటి ఘటనే సూర్యాపేటలో చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
Read also: Telangana and Andhra Pradesh: నేటితో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ.. 3 గంటల వరకే డెడ్‌లైన్
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు హైవే 65పై కారు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు హైవేని ట్రాఫిక్ జామ్ నుండి క్లియర్ చేస్తున్నారు.
Read also: Lok Sabha Elections 2024: నామినేషన్ల దాఖలుకు నేడే లాస్ట్ డే..
మరో ఘటనలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. బుధవారం రాత్రి వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై వర్ధన్నపేట నుంచి వరంగల్ వైపు వెళ్తున్న బైక్‌ను ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతులను వరుణ్ తేజ, సిద్దు, గణేష్, రణిల్ కుమార్‌లుగా గుర్తించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. ప్రమాదానికి కారణమైన వాహనాలను పోలీసులు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read also: Bones Health : మీ ఎముకలు దృడంగా మారాలంటే ఈ ఒక్కటి తీసుకుంటే చాలు..
సంగారెడ్డి జిల్లాలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. కారులో ఒకరు సజీవ దహనం అయినట్టు అనుమానం వ్యక్తం చేస్తాన్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటా హుటిన చేరుకుని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు.
Mumbai: 40 అడుగుల లోతున్న సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఇద్దరు కూలీలు మృతి