Kesineni Nani vs Kesineni Chinni: విజయవాడ లోక్‌సభ బరిలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని బరిలోకి దిగుతుండగా.. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి అభ్యర్థిగా ఆయన తమ్ముడు కేశినేని చిన్ని పోటీ చేస్తున్నారు.. గతంలోనే అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం జరిగినా.. ఎన్నికల సమయంలో అది తారాస్థాయికి చేరుకుంది.. చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేశినేని నాని.. గతంలో కేశినేని చిన్ని కారు నంబర్లు 5555.. నావి 7777.. కానీ, నేను ఎంపీ అయ్యాక తాను కూడా కారు నంబర్లు 7777 వాడాడు.. అంతేకాదు రియల్ ఎస్టేట్ దందాల కోసం వందల స్టిక్కర్లు కార్లకు వేసి వాడాడు.. నేను నా స్టిక్కర్ ఫేక్ వి తయారు చేసి వాడుతుంటే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను.. అపర కుబేరుడు అంటాడు ఇలా మోసాలు చేయటం ఏంటి ? కేశినేని చిన్ని లాంటి వ్యక్తులు ఎంపీ లేదా ఎమ్మెల్యే అయితే సమాజం పరిస్థితి ఏంటి ? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Jharkhand: హేమంత్ సోరెన్‌కు షాక్.. పిటిషన్ తిరస్కరించిన జార్ఖండ్ హైకోర్టు
నేను ఎంపీగా ఏ తప్పు చేయలేదు.. ఇలాంటి క్రిమినల్ చరిత్ర ఉన్న వ్యక్తికి ఎంపీగా టీడీపీ టికెట్ ఇచ్చింది.. ఇలాంటి వ్యక్తులు గెలిస్తే బెజవాడ ఫర్ సేల్ అనే బోర్డు పెడతారు అంటూ విమర్శించారు కేశినేని నాని.. బెజవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి మాత్రమే ఈ విషయాలను చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు. ఇక, మూడోసారి నేను ఎంపీగా పోటీ చేస్తున్నాను.. గతంలో 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేస్తే ఈసారి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నాను.. బెజవాడ నగరానికి కావాల్సిన మౌలిక సదుపాయాలపై నేను ఎక్కువ ఫోకస్ పెట్టాను అన్నారు. బెజవాడ జనాభా 17 లక్షలకు పైగా చేరింది.. విజయవాడ ఎయిర్ పోర్ట్ అభివృద్ది కోసం చంద్రబాబుతో విభేదించి మరీ చేశాను.. చంద్రబాబు అమరావతిలో కొత్త ఎయిర్ పోర్ట్ కట్టాలని అనుకున్నారు.. విజయవాడ – నాగ్‌పూర్ ఆక్సెక్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ హైవే తెచ్చాను అన్నారు. ఇప్పటి వరకు మచ్చలేని వ్యక్తులు మాత్రమే బెజవాడ ఎంపీ లుగా పనిచేశారు.. దురదృష్ట వశాత్తూ ఈసారి క్రిమినల్ చరిత్ర ఉన్న కేశినేని చిన్ని టీడీపీ నుంచి పోటీకి దిగారని దుయ్యబట్టారు. ఆయన నా తమ్ముడు కావటం దురదృష్టకరం.. ఆయన క్రిమినల్ చరిత్ర డాక్యుమెంట్ అవిడెన్స్ తో సహా చెప్పాలని డిసైడ్ అయ్యాను అన్నారు.
Read Also: Prajwal revanna: ప్రజ్వల్ రేవణ్ణకు మరో షాక్.. కర్ణాటక పోలీసులు ఏం చేశారంటే..!
ఇక, 1999 నుంచి కేశినేని చిన్ని నేను విడి పోయాం.. 25 ఏళ్ల నుంచి మేం విడిపోయామని తెలిపారు కేశినేని నాని.. అనేకసార్లు అప్పులు పాలయ్యను అని చిన్ని మోసం చేశాడు.. ఎన్నికల్లో పోటీకి దిగాడు కాబట్టి చెబుతున్నాను.. పిల్లల స్కూల్ ఫీజు, అద్దె కట్టడానికి డబ్బు లేదని చెబితే నేనే ఒక రూమ్ ఇచ్చాను.. నూజివీడులో భూమి కబ్జా చేసే ప్రయత్నం చేస్తే నేను మా ఆఫీసుకు రావద్దని చెప్పాను.. నా పేరు చెడగొట్టవద్దని ఆఫీసు నుంచి పంపించానని వెల్లడించారు. వెయ్యి పేజీలతో డాక్యుమెంట్ ఎవిడెన్స్ తో చిన్ని చిట్టా నేను చెబుతున్నాను.. ఎన్నికల అఫిడవిట్ చూస్తే 2020 వరకు రూపాయి ఆదాయం లేదని చిన్ని చెప్పాడు.. 2002 నుంచి ఇప్పటి వరకు ఆదాయపు పన్ను బకాయి ఉందని అఫిడవిట్ లో ఉంది.. రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాక ఆదాయపు పన్ను కడుతున్నాడు అని ఆరోపించారు. ఈ సమయంలో మోసాలు, చీటింగ్ లు చేస్తున్నాడు.. ఆరు నెలలకు ఒకసారి ఇల్లు మారుస్తూ ఆదాయపు పన్ను నోటీసులు తీసుకోవటం లేదన్నారు. చిన్ని కంపెనీలు అన్నీ సూట్ కేసు కంపెనీలు అని గుర్తించినట్టు కేంద్రం క్లారిటీ గా చెప్పింది.. కేశినేని డెవలపర్లు సంస్థ 2016లో నా సంతకం ఫోర్జరీ చేసి అనుమతి తీసుకున్నాడు అని విమర్శించారు.. కేశినేని అనేది ట్రెడ్ మార్క్ ఎవరూ వాడటానికి లేదన్న ఆయన.. ట్రెడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేస్తే రిజెక్ట్ అయ్యిందని గుర్తుచేశారు. బాగు పడతాడు అని నేను చూస్తే కేశినేని డెవలపర్లు పేరుతో మోసాలు చేశాడు చిన్ని.. తెలంగాణలో కేశినేని డెవలపర్ల పేరుతో మోసం చేశాడని తెలంగాణ రేరా ఫైన్ వేసింది.. ఓ సంస్థతో కలిసి చిన్ని మోసాలు చేశాడు.. ఆ సంస్థ యజమాని జైల్లో ఉన్నాడని తెలిపారు. ప్రీ లాంఛ్ ఆఫర్లు పేరుతో పేదల నుంచి డబ్బులు వసూలు చేసి మోసాలు చేసినట్టు తెలంగాణ రేరా గుర్తించిందని తెలిపారు.. ఇప్పటివరకు ఒక్క భవనం కూడా నిర్మాణం చేయలేదు.. ప్రగతి నగర లో 97 ఎకరాలు ఈడీ అటాచ్ చేసింది.. ఇక్కడ కూడా ప్రీ లాంఛ్ ఆఫర్లు పేరు మీద డబ్బులు వసూలు చేశాడు అంటూ తన తమ్ముడు, బెజవాడ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి కేశినేని చిన్నిపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేశినేని నాని.