Vellampalli Srinivas: టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరికాదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vellampalli Srinivas: విజయవాడలో సీఎం వైఎస్ జగన్‌పై రాయి దాడి ఘటన కలకలం రేపుతోంది.. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతో బోండా ఉమా దాడి చేయించాడు అంటూ సంచలన ఆరోపణలు చేవారు.. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. తాడేపల్లిలోని వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. విజయవాడలో సీఎం జగన్ బస్సు యాత్రకి మంచి స్పందన వచ్చింది. కానీ, సీఎం జగన్ ని హతమార్చడానికి టీడీపీ ప్లాన్ చేసింది.. రాయితో దాడి చేసి హతమార్చాలి అనుకున్నారని విమర్శించారు. కోడి కత్తి, గులకరాయి అంటూ టీడీపీ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. మేమే కావాలని దాడులు చేపించుకున్నాం అని వ్యగంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు, బొండా ఉమా జూన్ 4న మీ అంతు చూస్తామని బెదిరింపులు చేస్తున్నారు. నేను, కేశినేని నాని రౌడీలతో దాడి చేపించుకున్నామని బొండా ఉమా అంటున్నాడు. డబ్బులు ఇవ్వలేదు, అన్నా క్యాంటిన్ తీసేసారని సతీష్ అన్నాడని బొండా ఉమాకి ఎలా తెలుసు.? అని ప్రశ్నించారు.
ఇక, బొండా ఉమా తాగి మాట్లాడుతున్నాడు.. అధికారులను బెదిరిస్తున్నాడు.. కాబట్టి ఎన్నికల కమిషన్ సుమోటాగా కేసు ఫైల్ చేయాలని సూచించారు వెల్లంపల్లి.. సతీష్ అనే వ్యక్తి సీఎం మీద దాడి చేసిన సంగతి నిజం. బొండా ఉమా అనే దరిద్రం పోవాలని టీడీపీ నాయకులే అనుకుంటున్నారు. నిన్ను అరెస్ట్ చేయడానికి 100 మంది పోలీసులు అవసరమా? అని ప్రశ్నించారు. నువ్వు తప్పు చేయకపోతే ఎందుకు బయపడుతున్నావు.. చంద్రబాబు ఆదేశాలతో బొండా ఉమా దాడి చేయించాడని ఆరోపించారు. సతీష్ అనే వ్యక్తి మా నాయకుడేనని నిసిగ్గుగా చెప్పిన వ్యక్తి బొండా ఉమా అంటూ ఫైర్ అయ్యారు, ఎస్సీ, బీసీలను రౌడీలు, గుండాలగా టీడీపీ తయారు చేస్తున్నారు. తాగడం, తినడం మాత్రమే బొండా ఉమాకి తెలుసు. 100 శాతం చంద్రబాబు ఆదేశాలతో బొండా ఉమా టీం జగన్ హత మార్చాలని ప్లాన్ వేశారని సంచలన ఆరోపణలు చేశారు.. బొండా ఉమా భూములు కబ్జా, ఆయన కొడుకులు బైక్ తో మనుషులని చంపిస్తాడు,సెక్స్ రాకెట్ లో బొండా ఉన్నాడని విమర్శించారు.. ఇక, కేసులో ఆధారాలు ఉంటే బొండా ఉమని A1 అయినా పెడతారు.. జూన్ 4 తర్వాత జగన్ మళ్లీ సీఎం అయ్యాక ఈ దాడి మీద పూర్తి విచారణ చేస్తాం అని ప్రకటించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.
Also Read
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
- BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
- iPhone 18 వచ్చేసింది.. కానీ iPhone 17కే డిమాండ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
-
Indian Air Force: భారత్-యూకే రక్షణ సహకారంలో కొత్త అధ్యాయం.. బ్రిటిష్ పైలట్లకు ఇక భారత IAF శిక్షణ
-
DC Success Gift : అందరికి ఇచ్చి ‘వామికాగబ్బీ’కి కారు గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు.?
-
BRICS Summit: అణిచివేతకు తలొగ్గం.. ఢిల్లీ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అధ్యక్షుడి మాస్ వార్నింగ్..!
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?