ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా.. అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీగా నగదును సీజ్ చేశారు. ఓ కారులో నగదు తీసుకువెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. పట్టుబడ్డ నగదు.. సుమారు కోటి 50 లక్షలు ఉన్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ జిల్లాలో 16.83లక్షల ఓటర్లు ఉన్నారు అని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. జిల్లా ఎన్నికల కంట్రోల్ రూంను ఏర్పాటు చేశాం.. 0866-2570051కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు అని తెలిపారు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్కును ఆయన ప్రారంభించనున్నారు.
చంద్రబాబు చేసిన పనులకు తగిన శాస్తి జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఆలయాలను జగన్ తిరిగి నిర్మిస్తున్నారని ఆయన తెలిపారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిలోని మహా మండపం, పాత మెట్ల వద్ద పునః నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి ఆలయం వద్ద విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు.