Heavy Traffic Jam: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై శని, ఆదివారల్లో తెల్లవారుజామున భారీ వాహనాల రద్దీ పెరిగింది.
హైదరాబాద్ లో వాహన రద్దీ నెలకొంది. ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర వాసులు బయలు దేరారు. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయణమవుతున్నారు.
విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి మహాసభ జరగనుంది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాలు హాజరుకానున్నారు.
విజయవాడ బందర్ రోడ్డులో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ముగిసింది.. గంట పాటు బందర్ రోడ్డులో రోడ్ షో నిర్వహించారు ప్రధాని మోడీ.. ఈ రోడ్ షోలో వాహనంపై ప్రధాని మోడీకి ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. మరోవైపు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ నిలబడి.. దారిపొడవునా.. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.. ప్రధాని మోడీ రోడ్ షో.. బీజేపీ-టీడీపీ-జనసేన కూటమిలో కొత్త జోష్ నింపిందని కూటమి నేతలు చెబుతున్నారు..
తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. 6వ తేదీన ఏపీలో పర్యటించిన ప్రధాని.. నేడు మరోసారి ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3.35 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతి ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోడీ చేరుకోనున్నారు.
తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న ఏపీ జనం ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దీంతో.. ప్రజలు వేడిమి నుంచి ఉపశమనం పొందుతున్నారు. కొన్ని చోట్ల వాతావరణం చల్లబడగా.. మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. దీంతో.. నగరం అతలాకుతలం అయ్యింది.
తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత పాల్గొన్నారు.