ప్రధాని మోడీ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. ఈరోజు ఏపీలో పర్యటించిన ప్రధాని, ఈ నెల 8వ తేదీన విజయవాడకు రానున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు రోడ్ షోలో పాల్గొననున్నారు. ప్రధాన రోడ్లలో సరుకు రవాణా వాహనాలు, భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు సహా అన్ని వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపులు చేయనున్నారు. మరోవైపు.. రోడ్ షోలో పాల్గొనటం కోసం వచ్చే వారికి…
తన తండ్రికి మద్దతుగా కేశినేని శ్వేత ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 51 వ డివిజన్ గడప గడపకు ఎన్నికల ప్రచారంలో కేశినేని శ్వేత, యాంకర్ శ్యామల పాల్గొన్నారు. స్వచ్చందంగా వైస్సార్సీపీ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో యాంకర్ శ్యామల ఈ రోజు 51వ డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని కేశినేత శ్వేత తెలిపారు.
విజయవాడ వ్యాపార రంగానికి వస్త్రలత ఒక ల్యాండ్ మార్క్ వంటిదని కేశినేని శ్వేత అన్నారు. వస్త్రలత కార్మికుల సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని.. వైఎస్సార్సీపీ కార్మికుల, కర్షకుల పక్షపాత పార్టీ అని వ్యాఖ్యానించారు.
చార్లెస్ శోభరాజ్ కంటే కేశినేని చిన్ని పెద్ద మోసగాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు కేశినేని నాని.. గతంలో కేశినేని చిన్ని కారు నంబర్లు 5555.. నావి 7777.. కానీ, నేను ఎంపీ అయ్యాక తాను కూడా కారు నంబర్లు 7777 వాడాడు.. అంతేకాదు రియల్ ఎస్టేట్ దందాల కోసం వందల స్టిక్కర్లు కార్లకు వేసి వాడాడు.. నేను నా స్టిక్కర్ ఫేక్ వి తయారు చేసి వాడుతుంటే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను.. అపర కుబేరుడు…
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నేతలు ప్రచార జోరును పెంచారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు.. విద్యకు పెద్దపీట వేసి నాడు-నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలలో నాణ్యమైన విద్య అందజేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు కేశినేని శ్వేతా.
Suryapet Road Accident: ఇటీవల తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.