విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 27 న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ వెంత్ ను నేడు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ లో చిత్ర బృందంతో…
మే 27వ తేదీన ఎఫ్3 సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో.. మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాల్ని వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల్ని ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో భాగంగా ఈ సినిమాకి సంగీతం సమకూర్చిన దేవి శ్రీ ప్రసాద్.. ఇందులో ఎఫ్3కి మించిన వినోదం ఉందని, అలాగే ఓ చక్కటి సందేశమూ ఉందని చెప్పాడు. జంధ్యాల, ఈవీవీ ఎంత చక్కగా హాస్యం పండించారో.. అలాంటి ఆరోగ్యకరమైన హాస్యమే ‘ఎఫ్3’లో ఉందని తెలిపాడు.…
‘ఎఫ్2’తో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన వెంకటేశ్, వరుణ్ తేజ్.. ఇప్పుడు ‘ఎఫ్3’తో మరోసారి నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మే 27వ తేదీన గ్రాండ్‌గా విడుదల అవుతోంది. ఆల్రెడీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవ్వగా, ఈరోజు సాయంత్రం ఫంటాస్టిక్ ఈవెంట్‌ని మేకర్స్ నిర్వహించబోతున్నారు. ఈ వేడుక ఎన్టీవీలో లైవ్ ప్రసారం కానుంది. ఇతర ఈవెంట్లకు భిన్నంగా, మొత్తం సరదాగా సాగిపోయేలా ఈ ‘ఫంటాస్టిక్’ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. కాగా.. మొదటి భాగం ఘనవిజయం సాధించడంతో, దర్శకుడు అనిల్ రావిపూడి…
ఈమధ్య కాలంలో తెలంగాణలో విడుదలవుతోన్న ప్రతీ సినిమాకు టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తోన్న విషయం తెలిసిందే! కరోనా కాలంలో చిత్ర పరిశ్రమ బాగా దెబ్బతిన్న నేపథ్యంలో.. గరిష్టంగా టికెట్ రేట్లను పెంచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. అప్పటినుంచి చిన్న, పెద్ద అని తేడా లేకుండా.. విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. దీంతో, థియేటర్లకు వెళ్ళే ఆడియన్స్ సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాలైతే దీని వల్ల లాభాలు పొందాయి కానీ, మిగతావే బాగా దెబ్బతిన్నాయి. తమ…
ఒక హీరోయిన్ ఏ పాత్ర ఇచ్చిన చేయగలగాలి.. ఇలాంటి పాత్రలే చేస్తాను అని కూర్చుంటే.. అవకాశాలు అందుకోవడం కష్టం. నాటి తరం నాయికలు ఒకే హీరోకు చెల్లిగా చేశారు.. హీరోయిన్ గా చేశారు. అన్నాచెలెల్లిగా కన్నీళ్లు తెప్పించారు.. ప్రేమికులుగా రొమాన్స్ పండించారు. ఎలాంటి పాటలోనైనా ఒదిగిపోవడం హీరోయిన్ కు ఉండాల్సిన ప్రధాన లక్షణం.. ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డే కూడా అలాంటి హీరోయిన్లలో ఒకరు.. హీరోయిన్ గా ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోగలడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…
విక్టరీ వెంకటేష్ కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన సినిమాల్లో ‘ప్రేమించుకుందాం రా’ ఒకటి. జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 50 కి పైగా సెంటర్లలో సెంచరీ కొట్టింది. 57 సెంటర్లలో 50 రోజులు ఆడిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన అంజలి జావేరి నటించింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయ్యి తాజాగా పాతికేళ్ళు పూర్తి చేసుకొంది. ఈ…
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ ఎఫ్3. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా F3 ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 2019 సంక్రాంతి సీజన్లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన F2 మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 27న విడుదల కానుంది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు,…
ఎఫ్2 (ఫన్ & ఫ్రస్ట్రేషన్)కి సీక్వెల్‌గా ఎఫ్3 సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! దాదాపు ఆ సినిమాలో ఉన్న కాస్టింగే, ఇందులోనూ ఉంది. అదనపు ఆకర్షణగా సునీల్‌తో పాటు సోనాల్ చౌహాన్‌కి కూడా దర్శకుడు అనిల్ రావిపూడి తీసుకున్నాడు. తొలి సినిమా కన్నా ఈ సీక్వెల్‌తో మరిన్ని నవ్వులు పూయించాలన్న అనిల్ పూనుకోవడమే కాదు, ఇది కచ్ఛితంగా డబుల్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుందని నమ్మకంగా ఉన్నాడు కూడా! దాదాపు ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో, చిత్రబృందం…
టాలీవుడ్ లో సీక్వెల్స్ చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. ఒక వేళ వచ్చినా ఒక్క హీరో తప్ప మిగిలిన వారందరు కొత్తవాళ్లు ఉంటారు.. కథ మొత్తం మారిపోతుంది. ఒక్క సీక్వెల్ అన్న పేరు తప్ప పార్ట్ 1 కు పార్ట్ 2 కు సంబంధమే ఉండదు. అయితే ఇలాంటివేమి ‘ఎఫ్ 3’ కి వర్తించవు అంటున్నాడు అనిల్ రావిపూడి. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా ‘ఎఫ్ 2’ ను తెరకెక్కించి ప్రేక్షకుల మనస్సులను కొల్లగొట్టాడు…
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 మూవీ నుంచి మరో సాంగ్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ‘ఊ .. ఆ .. అహ అహ’ అంటూ ఈ పాట సాగుతుంది. నీ కోర మీసం చూస్తుంటే.. నువ్వుట్టా తిప్పేస్తుంటే.. అంటూ సాంగ్ ప్రారంభంలో లిరిక్స్ వినిపిస్తున్నాయి. మంచి రొమాంటిక్‌గా కనిపిస్తున్న ఈ పాటను వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జంటలపై చిత్రీకరించారు. ఈ పాటను కాసర్ల శ్యామ్…