రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. జూన్ 17 న రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ లో బిజీగా మారిన చిత్ర బృందం నేడు శిల్పా కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఇక ఈ వేడుకలో రానా మాట్లాడుతూ “అందరికీ వందనాలు.. మా చిన్నాన్న లేకుండా పర్సనల్ గా కానీ, ప్రొఫెషనల్ గా కానీ ఏ శుభకార్యం జరగదు. థాంక్యూ చిన్నాన్న వచ్చినందుకు .. ఇక్కడికి వచ్చిన రామ్ చరణ్ అభిమానులకు థాంక్స్.. చరణ్ ఫ్లైట్ మిస్ అయ్యి హైదరాబాద్ కు ఇంకా చేరుకోలేదు.. అందుకే తను రాలేకపోయాడు. చరణ్ తరుపున నేను సారీ చెప్తున్నాను. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ముందుగా డైరెక్టర్ వేణు ఉడుగుల.. ఎంతో నిజాయితీతో తను పెరిగిన ఊరులలో, తను పెరిగిన పరిస్థితిల్లో ఒక భయంకరమైన బ్యాక్ డ్రాప్ లో ఒక అద్భుతమైన లవ్ స్టోరీ తీశారు. ఆ భయంకరమైన లవ్ స్టోరీలో బ్యూటీ ఫుల్ లవ్ స్టోరీ అని అన్నాను.. సాయి పల్లవినే ఆ బ్యూటీ.
ఆవిడ నడుస్తుంటే చాలు పక్కన వెన్నెల తిరుగుతున్నట్లు ఉంటుంది. ఈ సినిమాలో ఎవరు ఉన్నా లేకపోయినా సాయి పల్లవి లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. ఆమెతో పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అద్భుతమైన కథలు చేసే నిర్మాతలు చాలా అరుదుగా ఉంటారు. మా నిర్మాతలు అలాంటి అరుదైన రకం.. ఈ సినిమాను మాకు ఇచ్చినందుకు థాంక్స్. ఈ సినిమాకోసం పనిచేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ఈ సినిమాలో ఉన్న 8 కీలక పాత్రలో 5 పాత్రలు స్త్రీలవే.. ఇది పెద్ద స్త్రీ సినిమా.. ఇక ఈ ఒక్క సినిమాలోనే నేను ఎముకలు ఏవి విరొగొట్టుకోకుండా ఇంటికి వెళ్లగలిగాను.. దానికి కారణం పీటర్ హెయిన్స్ మాస్టర్.. థాంక్స్ మాస్టర్.. ముందు ముందు ఇలాగే గాయాలు కాకుండా సినిమాలు మనం చేయాలనీ కోరుకుంటున్నాను. ఇక చివరగా నా ఫ్యాన్స్ కు.. మీకు సెరోజు ఒక నిజం చెప్పాలి. నాకెప్పుడూ విక్టరీ వెంకటేష్ గారి ఫ్యాన్సే ఉంటారనుకున్నాను.. నాకు ఫ్యాన్స్ ఉంటారని తెలియదు.. ఈ సినిమా ఒప్పుకున్నాకే నాకు ఫ్యాన్స్ ఉన్నారని తెలిసి వచ్చింది.. ఎందుకంటే ఈ సినిమా ఒప్పుకున్నాకా చాలామంది అన్న ఎందుకు ఈ సినిమా తీస్తున్నావ్ అంటూ అడుగుతున్నారు.. వారందరికీ ఒకటే చెప్తున్నా.. ఇకనుంచి సినిమాలు మీకు నచ్చినట్టే చేస్తుంటా .. పిచ్చెక్కించేద్దాం” అంటూ చెప్పుకొచ్చాడు.