విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫన్ ఫ్రాంఛైజ్ ‘ఎఫ్3’.. ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెల్సిందే.. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం తొలి షోతోనే పాజిటివ్ టాక్ అందుకొని రెండు తెలుగురాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ దిశగా కొనసాగుతుంది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ‘ఎఫ్3’ చిత్ర బృందం షాక్ ఇచ్చింది. సాధారణంగా ఏ సినిమా అయినా రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటిటిలో ప్రత్యక్షమవుతుంది. ఇక పాన్ ఇండియా మూవీలు.. లేక ఎక్కువ వసూళ్లు రాబట్టే మూవీలు మాత్రమే ఓటిటీలోకి రావడానికి కొద్దిగా ఆలస్యమవుతాయి.
ఇక ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందుతుందని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రం ఓటిటీలో నాలుగు వారాలకు కాకుండా 8 వారాలకు ఓటిటిలోకి అడుగుపెడుతున్నట్లు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని హీరోలు వెంకీ, వరుణ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక వీడియో ద్వారా తెలిపారు . 8 వారాల తరువాతే ఎఫ్3 ఓటిటీ స్ట్రీమింగ్ కానున్నదని, అప్పటివరకు కూర్చోకుండా థియేటర్ కు వెళ్లి ఫన్ ఫుల్ సినిమాను ఎంజాయ్ చేయాలని తెలిపారు. దీంతో అభిమానులు కొద్దిగా నిరాశపడుతున్నారు.