విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం మే 27 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రూ.100 కోట్ల క్లబ్బులో కూడా జాయిన్ అయ్యింది. దీంతో చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అదే రేంజ్ లో చేసుకున్నారు. ఇంకా కొన్నిచోట్ల ఎఫ్ 3 రికార్డు మోత మోగిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా ట్రిపుల్ ప్లాటినం సెలబ్రేషన్స్ ను బంజారా హిల్స్ లోని రాడిసన్ హోటల్ లో నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిదిగా విచ్చేసి చిత్ర బృందాన్ని అభినందించారు.
ఇక ఈ వేడుకలో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ ” లాస్ట్ ఫంక్షన్ అయిపోగానే.. ఏంటి అప్పుడే ప్రమోషన్స్ అన్ని అయిపోయాయా.. ఇన్ని చేశాం అప్పుడే అయిపోయిందా అని అనుకున్నాం.. మల్లి ఇప్పుడు దీంతో ఇలా ఫినిషింగ్ బావుంది.. నాకు నచ్చింది. యాక్టర్ గా సినిమా బాగుంది అన్నప్పుడు హ్యాపీ కలెక్షన్స్ బాగా వస్తున్నాయి అన్నప్పుడు ఇంకా హ్యాపీ గా వుంటుంది. డిస్ట్రిబ్యూటర్ బాగున్నారు అన్నప్పుడు చాలా హ్యాపీగా వుంటుంది.ఈ సినిమాకి అలాంటి హ్యాపీనే ఫీలయ్యాను.ఈ సినిమాను ఆదరించిన అందరికీ థాంక్స్” అని చెప్పుకొచ్చాడు.