Venkaiah Naidu: బాపట్ల జిల్లాలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శనివారం నాడు పర్యటించారు. వేటపాలెం మండలంలోని బండ్ల బాపయ్య విద్యాసంస్థల శతజయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన 100 సంవత్సరాల పైలాన్‌ను వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండ్ల బాపయ్య విద్యా సంస్థల శత జయంతి ఉత్సవాలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. చీరాలతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. అన్ని దానాలలో విద్యాదానం చాలా గొప్పదని వెంకయ్యనాయుడు…
ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై పలు సందర్భాల్లో విమర్శలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏపీలోని రోడ్ల దుస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం ప్రభగిరిపట్నం సమీపంలోని కిసాన్ క్రాఫ్ట్ ను సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా సొంత జిల్లా నెల్లూరులో కిసాన్ క్రాఫ్ట్ సంస్థను నెలకొల్పడంఎంతో సంతోషంగా ఉందన్నారు.. స్ధానికంగా ఉన్న గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించడం ఎంతో అభినందనీయం అన్నారు.. నెల్లూరు జిల్లా నుండి…
sabka saath sabka vikas sabka vishwas book release: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రసంగాలను సబ్ కా సాత్ - సబ్ కా వికాస్ - సబ్ కా విశ్వాస్ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.…
Venkaiah Naidu: విజయవాడలో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఆయన స్నేహితులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరయ్యారు. టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైసీపీకి చెందిన యువ నేత దేవినేని అవినాష్, బీజేపీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు,…