విశాఖపట్నంలోని రుషికొండ గీతం యూనివర్శిటీలో పద్మశ్రీ కోనేరు రామకృష్ణారావు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు. ఆంధ్రా యూనివర్శిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ కోనేరు రామకృష్ణారావు సేవలను ప్రస్తుతించారు. గీతం యూనివర్శిటీలో హ్యూమనిటీస్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదిమందికి ఉపయోగపడేలా జీవితాన్ని మలచుకోవాలి..సంపదను సృష్టించే ప్రయత్నం చేయాలి..అది భావితరాల వారి అవసరం తీరుస్తుంది. షేర్ అండ్ కేర్ అనేదే మన భారతీయ తత్వం అన్నారు. సంస్కరణల అవసరం నేడు ఎంతైనా వుంది..సంపద పెంచుతూ అందరికీ పంచాలన్నారు.
Read Also: Venkatesh Netha: బీజేపీ డ్రామాల పార్టీ.. ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారు
సంపద సృష్టించకుండా పంచలేము..అప్పులు చేసి పంచడం ఎంతో కాలం సాగదు.. ఈ విషయం అన్ని పార్టీలు గమనించాలి. యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం పెంచుకోవాలి..జీవన సత్యాలు గమనించాలి…రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవు..ప్రజలకు చేయాలనుకున్న మేలు పట్టుదలతో వుండాలి..నేను రాజకీయాల్లో లేను…సామాన్య జీవితంలో వున్నాను…నేను రిటైర్డ్ అయ్యానే కానీ టైర్డ్ కాలేదు..రాజకీయాల్లో ఎత్తుకు ఎదిగినా మన మూలాలు మరిచిపోకూడదన్నారు వెంకయ్యనాయుడు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.శ్రీభరత్, విశ్వవిద్యాలయం అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Read Also: Bandi Sanjay Strong Counter Live: కేసీఆర్ కు బండి సంజయ్ కౌంటర్ ప్రెస్ మీట్