sabka saath sabka vikas sabka vishwas book release: ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగాల్లో ఎంపిక చేసిన కొన్ని ప్రసంగాలను సబ్ కా సాత్ – సబ్ కా వికాస్ – సబ్ కా విశ్వాస్ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి కేరళ గవర్నర్ ఆరీఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముస్లిం మహిళల శ్రేయస్సు కోసం త్రిపుల్ తలాక్ నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు. త్రిపుల్ తలాక్ నిషేధించడం మామూలు విషయం కాదని ఆయన అన్నారు.
Read Also: Mexico: ప్రధాని మోదీ రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పగలరు
ప్రధాని మోదీ ప్రసంగాలను బుక్ రూపంలో విడుదల చేయడం ఆనందంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. మోడీజీ ఫ్యాషన్ విత్ నేషన్ అని పొగిడారు. 2014లో మోదీ క్యాబినెట్ లో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా పనిచేశానని.. ఆయన గుర్తు చేసుకున్నారు. ఉక్రెయిన్ లాంటి దేశాల్లో ఏమవుతుందో చూస్తున్నామని.. భారతదేశంలో మాత్రం సర్వేజన సుఖినోభవంతు అన్న విధంగా ఉందని అన్నారు.
ప్రధాని మోదీ నూతన సంస్కరణలు చేపట్టారని.. ప్రజల జీవితాల్లో మార్పలు తీసుకువచ్చారని అన్నారు. దేశంలో 63 కోట్ల జన్ ధన్ ఖాతాలను తెరిపించి ప్రజలకు నేరుగా పథకాల లబ్ధి చేరేలా చేశారని కొనియాడారు. నోట్ల రద్దుతో మోదీ పని అయిపోయిందని అన్నారని..ప్రస్తుతం ప్రపంచ దేశాలు కూడా భారతదేశాన్ని గౌరవిస్తున్నాయని వెంకయ్య నాయుడు అన్నారు. దేశం కోవిడ్ తో పోరాడుతున్న సమయంలో ప్రధాన మంత్రి ఆత్మ నిర్బర్ భారత్ ప్రవేశపెట్టారని..200 కోట్ల కోవిడ్ టీకాలు దేశప్రజలకు ఇచ్చారని.. ఇది గొప్ప విజయం అని ఆయన అన్నారు.