Venkaiah Naidu: జ్యేష్ఠ కార్యకర్తలను కలవాలనే ఆలోచన ఉత్తమమని.. దేశానికి సిద్ధాంత పరమైన రాజకీయాలు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. జాతీయ వాద భావన, సిద్ధాంత పరమైన రాజకీయాలు లేకపోతే ప్రజాస్వామ్యం విఫలం అవుతుంది.. చెప్పిన మాటకు కట్టుబడే నీతి నియమం కలిగిన రాజకీయాలు కావాలన్నారు. నిత్యం జనంతో సంపర్కం కావాలి..
Venkaiah Naidu: పటేల్ 150 జయంతి దేశ వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. సర్దార్ ఒక ఉక్కుమనిషి.. పటేల్ దేశ సమైక్యత శిల్పి అని కొనియాడారు. ఆయన సంస్కరణలు దేశానికి ఆదర్శం.. దేశానికి మొదటి ప్రధాని కావాల్సిన వారని గుర్తు చేశారు. దేశంలో ఉన్న 15 రాష్ట్రాల్లో నాడు 14 రాష్ట్రాలు పటేల్ ప్రధాని కావాలని కోరాయని తెలిపారు. గాంధీ కోరిక మేరకు ప్రధాని పదవిని…
Alai Balai Event: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమం ఘనంగా జరిగింది. దత్తాత్రేయ 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజున నిర్వహించడం ఆనవాయితీ. ఈ ఏడాది ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ‘ఆపరేషన్ సింధూర్’ థీమ్‌తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారిలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, కేంద్ర మంత్రి అర్జున్…
‘విజయవాడ’ పేరులోనే విజయం ఉందని.. చరిత్ర రాయాలన్నా, సృష్టించాలన్నా విజయవాడతోనే సాధ్యం అని మంత్రి నారా లోకేష్ అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. జీవోలన్ని తెలుగులో వస్తున్నాయంటే అది వెంకయ్య నాయుడుతోనే సాధ్యం అని పేర్కొన్నారు. ఆయన ఏజ్ ఒక నంబర్ మాత్రమే అన్నారు. వెంకయ్య నాయుడు, సీఎం చంద్రబాబుతో తాను పోటీ పడలేకపోతున్నానని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. విజయవాడలోని పున్నమి ఘాట్‌లో శోభాయమానంగా…
Brahmanandam : ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ME and मैं పేరుతో రాసిన ఆయన ఆత్మకథ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ.. నేను ఈ పుస్తకం రాయడానికి ఎంతో మంది స్ఫూర్తిగా ఉన్నారు. ఎందుకు రాశాను అంటే అదో పెద్ద చర్చ. ఎంతో మంది మహానుభావులు చిన్న స్థాయి నుంచి ఎంతో ఎత్తుకు ఎదిగారు. నేను కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. లెక్చరర్ గా…
Venkaiah Naidu : స్క్రీన్ మీద బ్రహ్మానందం కనిపిస్తేనే ప్రేక్షకులకు నవ్వొస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బ్రహ్మానందం హిందీ, ఇంగ్లిష్ లో ME and मैं పేరుతో తన ఆత్మకథను రాశారు. ఈ పుస్తకాన్ని నేడు వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. బ్రహ్మానందం సినిమాల్లో ఎనలేని పేరును సంపాదించుకున్నారు. ఆయన జీవిత చరిత్రను హిందీ, ఇంగ్లిష్ లో తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది. బ్రహ్మానందం ఇప్పటికే 1200…
నేడు వివాహ వ్యవస్థపై కూడా నమ్మకం పోతుంది అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన కుటుంబ, వివాహ వ్యవస్థ చూసే ప్రపంచ దేశాలు గౌరవిస్తాయి.. ఫిజిక్స్ చూసి పెళ్లిళ్లు.. కెమిస్ట్రీ బాగొలేదని విడాకులు తీసుకుంటున్నారు ఇప్పుడు అని విమర్శించారు.
తిరుమలలో వీఐపీల దర్శనంపై కీలక వ్యాఖ్యలు చేశారు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు.. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాలంటూ సూచించారు.. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి నిన్న తిరుమల చేరుకున్న వెంకయ్య నాయుడు.
Venkaih Naidu : సీనియర్ నటుడు కోట శ్రీనివాస్ మృతి పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. కోట శ్రీనివాస్ రావు మరణం విచారకరం అన్నారు. కోట శ్రీనివాస్ గొప్ప మానవతావాది. అంతకు మించిన గొప్ప నటుడు. విలక్షణమైన పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయన సినిమాలలో కనిపిస్తే హాస్యం పండుతుంది. బిజెపి లో చేరి విజయవాడ నుండి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో సేవలు చేశారు. ఆయన కుమారుడి మరణం ఆయన జీవితాన్ని…
గత ఎన్నికలలో భూతులు మాట్లాడిన నేతలు అందరూ ఓడిపోయారు.. వారు ఎవరో మీకే తెలుసు.. ప్రజల అందరూ ఆ నేతల భూతులు వినలేక.. పోలింగ్ భూత్లోకి వెళ్లి ఓటు వేసి ఓడించారు.. భూతులు కంటే పోలింగ్ భూత్ గొప్పది.. బలమైనది అని పేర్కొన్నారు.