ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో నేడు ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. కాగా.. శ్రీమతి సుశీలానారాయణరెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో నేడు రవీంద్రభారతిలో జరిగే ‘జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి’ జయంతి ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈనేపథ్యంలో.. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి రవీంద్రభారతి వరకు, కార్యక్రమం ముగిసిన తర్వాత రవీంద్రభారతి నుంచి జూబ్లీహిల్స్ వరకు ట్రాఫిక్ ఆంక్షాలు ఉంటాయని అధికారులు తెలిపారు. read also: Tragedy in Medak:…
భారత ఉపరాష్ట్రపతి పదవికి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వా పేరును విపక్ష పార్టీలు ఎంపిక చేశాయి. ఆమెను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెల్లడించారు.
Amarinder Singh is currently in London for a back surgery. According to sources in the saffron camp, the process of merging his party 'Punjab Lok Congress' with the BJP will begin when he returns home after a couple of weeks.
రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చగా మారింది. గత సంప్రదాయాలకు అనుగుణంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును రాష్ట్రపతిని చేస్తారని అంతా భావించారు. హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన్ని హుటాహుటిన ఢిల్లీ రావాలని చెప్పడం.. ఆ తర్వాత అమిత్ షా తదితరులు వెంకయ్య దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా సమావేశం కావడంతో ఆయనే తదుపది రాష్ట్రపతి అభ్యర్థిగా అందరూ భావించారు. సంఖ్యా పరంగా ఎన్డీయేకు రాష్ట్రపతిని గెలిపించుకునే బలం ఉండటంతో.. చాలా…
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం ఇవాళ జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి అభ్యర్థిపై ఉత్కంఠకు తెరదించే అవకాశం ఉంది. ఈ భేటీలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొననున్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు భాజపా అధిష్ఠానం ఇప్పటికే కసరత్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో…
ప్రపంచ వ్యాప్తంగా జూన్ 21న ప్రజలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం 8వ ఎడిషన్‌ను ‘మానవత్వం కోసం యోగా’ అనే థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలోనూ హైదరాబాద్ నగరంలోనూ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. The Vice President, Shri M. Venkaiah Naidu attended the International Day of Yoga 2022 celebrations organised by the…
సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో ఈ నెల 21 (రేపు)న జరగనున్న యోగా డే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సోమవారం నగరానికి వస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఉపరాష్ట్రపతి సోమవారం సాయంత్రం 6.10 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి పీఎన్టీ ఫ్లైఓవర్, శ్యాంలాల్ బిల్డింగ్, బేగంపేట్ ఫ్లైఓవర్, పంజాగుట్ట ఫ్లై ఓవర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ద్వారా రోడ్ నెంబర్ 29లోని నివాసానికి చేరుకుంటారు. మంగళవారం ఉదయం 6.20…