భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు మరోసారి కరోనా మహమ్మారి బారినపడ్డారు.. స్వల్ప లక్షణాలు ఉండడంతో.. తాజాగా ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలినిట్టు.. ఉపరాష్ట్రపతి కార్యాలయంలో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.. ఈరోజు నిర్వహించిన కరోనా పరీక్షల్లో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారని ఉప రాష్ట్రపతి కార్యాలయం పేర్కొంది. కాగా, వెంకయ్యనాయుడుకి…
భోగి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని ఏపీలో సంబరాలు అంబరానంటాయి. వేకువజామునే భోగి మంటలు వేసి కోలాహలంగా కుటుంబ సమేతంగా అందరూ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ రాజకీయ ప్రముఖులు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సమేతంగా కారంచేడులోని తన సోదరి పురందేశ్వరి నివాసంలో నందమూరి బాలకృష్ణ భోగి పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రజలకు, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని, పంటలు ఇంటికి…
ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి వెళ్ళారు వెంకయ్యనాయుడు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవల్ని కొనియాడారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రోశయ్య కుటుంబసభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు. రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం. తమిళనాడు గవర్నర్ గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉంది. ఆయన సేవలు మరువలేనివి. వారు నాకు…
12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ వ్యవహారం ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తోంది.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసిన రాజ్యసభ ఛైర్మన్.. శీతాకాల సమావేశాల నుంచి కూడా మొత్తంగా సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై విపక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.. ఎంపీలు ఫూలో దేవి నేత, ఛాయా వర్మ, రిపున్ బోరా, రాజమణి పటేల్, సయ్యద్ నాసిర్ హుస్సేన్, అఖిలేశ్ ప్రసాద్ సింగ్, డోలా…
హక్కులను పొందడం కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నదే రామావతార సందేశం అన్నారు భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు. రామాయణం భారతీయ సంస్కృతికి చుక్కాని వంటిదన్నారు. శ్రీ కొమాండూర్ శశికిరణ్ రాసిన శ్రీమద్రామాయణం పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి కీలక ఉపన్యాసం చేశారు.మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని బోధించిన మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముని జీవితం మనందరికీ ఆదర్శ ప్రాయం. ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువతరం నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. శ్రీరాముడి జీవిత గాధ నుంచి…
హైదరాబాద్‌లో యోధా లైఫ్‌లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభమైంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవిలు ప్రారంభించారు. వైద్యరంగంలో అనేక పెనుమార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరంలో వైద్యం అందుబాటులోకి వస్తోందని మెగస్టార్ చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీనోమ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జీన్స్ ను ఆధారంగా చేసుకొని మనిషికి వచ్చే జబ్బులను ముందుగానే తెలుసుకోవచ్చని అన్నారు. కరోనా సమయంలో జీనోమ్…
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు మానేసి మంచి పని చేశారని… రాజకీయాలు మాట్లాడే భాష అస్సలు బాగోలేదని..ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మెగాస్టార్ చిరంజీవి, క్రికెటర్ అజారుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఉపరాష్ట్రపతి పదవి వల్ల కొంచం తొందరగా పడుకుంటున్నానని..…
హైదరాబాద్ అమీర్ పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన యోధ లైఫ్ లైన్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు రాష్ట్రపతి అవ్వాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే ఏడాది జూలై నాటికి పూర్తవుతుంది. Read Also: విమాన ప్రయాణికుడి ప్రాణాలు కాపాడిన కేంద్రమంత్రి..…