ఇటీవల కన్నుమూసిన మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య కుటుంబాన్ని పరామర్శించారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. హైదరాబాద్‌లోని రోశయ్య నివాసానికి వెళ్ళారు వెంకయ్యనాయుడు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవల్ని కొనియాడారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రోశయ్య కుటుంబసభ్యులతో మాట్లాడి, ధైర్యం చెప్పారు.
రోశయ్య, నేను ఒకేసారి సీఎంలుగా పనిచేశాం. తమిళనాడు గవర్నర్ గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉంది. ఆయన సేవలు మరువలేనివి. వారు నాకు చిరకాల మిత్రులు. వారి అనుభవం కీలక సమయాల్లో బాగా పనిచేసింది. ఓర్పు, నేర్పు కలిగిన మంచివక్త రోశయ్య. ఆయన అందరి అభిమానాన్ని చూరగొన్నారని వెంకయ్యనాయుడు రోశయ్య కన్నుమూసిన సందర్భంలో తన సంతాపం తెలిపారు.