కోవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదు అని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. అయితే మన దేశంలో కరోనా టీకా అందుబాటులోకి వచ్చి దాదాపు 8 వేళలు అవుతున్న కొంత మంది టీకా తీసుకోవడానికి ఇంకా సంకోచిస్తున్నారు. అయితే టీకాపై ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ… టీకాకరణ కార్యక్రమం ప్రజాఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉంది. టీకానంతరం కూడా జాగ్రత్తలు పాటించాల్సిందేనన్నారు వెంకయ్యనాయుడు. అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలి, ఇందులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. సమష్టికృషితో కరోనా…
కోవిడ్ టీకాపై అపోహలు అవసరం లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగురాష్ట్రాల్లోని మూడు కేంద్రాల్లో ఉచిత కోవాగ్జిన్ టీకా పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టీకాకరణ కార్యక్రమం ప్రజాఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉందని… టీకానంతరం కూడా జాగ్రత్తలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. అసాధారణ సంక్షోభాన్ని అసాధారణ రీతిలోనే ఎదుర్కోవాలి, ఇందులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.…
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్పూర్తితో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సతీమణి ఉషా మరియు కుమార్తె దీపా వెంకట్ బెంగుళూరు దేవనహళ్లిలో సదహళ్లి గేట్ వద్ద మొక్కలు నాటారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుధీర్ వారికీ వృక్షవేదం పుస్తకాన్ని బహుకరించారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్బుతమని ప్రతి ఒక్కరు పాల్గొని మొక్కలు నాటాలని వారు ఆకాక్షించారు. అడవులు, చెట్ల గొప్పతనాన్ని తెలియజేసెలా వృక్షవేదం పుస్తకాన్ని తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. ఇంత మంచి…
పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయంతే. ఏ కార్యక్రమం సరిగా సాగదు. ప్రశ్నలు లేవు.. సమాధానాలు లేవు. ఇక చర్చల ప్రసక్తే లేదు.. నినాదాలు ..ఇకటే రణగొణ ధ్వనులు . గత రెండు వారాలుగా పార్లమెంట్ లో ఇవి తప్ప మరొకటి ఉందా. ఇదీ మనం చూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తీరు. పంతం నెగ్గించుకోవటానికి ప్రతిపక్ష సభ్యులు దేనికైనా సిద్ధమంటున్నారు. కాగితాలు చింపుతారు. స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్తారు. చైర్మన్ సీట్‌పైకి ఫైల్స్ విసిరేస్తారు.. టేబుల్…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి నేతృత్వంలోని కామర్స్ పార్లమెంటరీ స్థాయీ సంఘం పనితీరును ప్రశంసిస్తూ ఈ రోజు రాజ్యసభలో చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభినందించారు. పార్లమెంట్ సమావేశాల విరామ కాలంలో వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల పనితీరును విశ్లేషించిన ఆయన కామర్స్ కమిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ప్రశంసించారు. read also : ఈశాన్య భారతాన్ని వణికిస్తోన్న డెల్టా వైరస్ పార్లమెంట్ విరామ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమై 15 గంటల 51…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత చుట్టు పక్కల కాలనీల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలకు ఇబ్బంది మారిన కంటోన్మెంట్ రహదారుల మూసివేత సమస్యను పరిశీలించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ కు సూచించారు. నూతనంగా సహాయమంత్రిగా నియమితులైన అజయ్ భట్, ఆదివారం నాడు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో, వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. read also : ముగిసిన శ్రీలంక ఇన్నింగ్స్…ఇండియా టార్గెట్ ఎంతంటే ? ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్…
ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. అయితే ఈ సమావేశానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. కానీ ఉపరాష్ట్రపతిని కలిసినట్టు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నా సోదరితో పాటు గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసాను. ఆయనతో కలిసి కొంత క్వాలిటీ టైం ను స్పెండ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనతో పలు విషయాల గురించి చర్చించాము. ఆయనతో మాట్లాడిన టాపిక్స్ లో నాకు ఇష్టమైన సామాజిక సేవ కూడా ఉంది.…
పీవీ గొప్ప రాజనీతిజ్ఞుడు.. ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడు.. కానీ, ఆయన సేవలకు తగిన గౌరవం లభించలేదన్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు… మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా నివాళులర్పించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీవీని బహుముఖ ప్రజ్ఞాశాలిగా అభివర్ణించారు.. మాతృభాష పట్ల ఆయనకున్న ప్రేమను గుర్తు చేసుకున్నారు.. ఏ దేశం అయినా సంస్కృతి, వారసత్వం, గొప్ప నాయకుల సేవలను మరచిపోయి ముందుకు సాగలేదన్నారు.. విప్లవాత్మక ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకత్వం వహించిన క్రాంతదర్శిగా పీవీని అభివర్ణించిన…
తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపు దాల్చాలని పిలుపునిచ్చారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. విశాఖలో రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను చాటుకునేందుకు సంఘటితంగా ముందు సాగుదామన్నారు.. మన భాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడంతో పాటు ఇతరుల భాషా సంస్కృతులను గౌరవించాలన్నారు.. మనుషులనే గాక, తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉందన్నారు. ఆచార…
నేడు విశాఖపట్నంకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రానున్నారు. ఉదయం 11.45కు ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు. విమానాశ్రయంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటుగా తూర్పు నౌకాదళాధిపతి, కలెక్టర్, సీపీ, ఎస్సీ, తదితర అధికారులతో పాటు మేయరు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగత కార్యక్రమంలో పాల్గొననున్నారు. నాలుగు రోజుల పాటు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. 29న ఉదయం 11.30 గంటలకు తిరుగు ప్రయాణమవుతారని అధికారిక ప్రకటనలో తెలిపారు.