ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుపై కేంద్ర హోం మంత్రి అమి త్‌షా ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హాజరయ్యారు. ఉపరాష్ర్టపతి వెంకయ్య నాయుడితో కలిసి ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంకయ్య స్వస్థలంలో ఆయన గురించి మాట్లాడాలన్న నా అభిలాష ఇప్పటికి నేరవేరిందని హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు…
దీపావళి పండుగ నేపథ్యంలో దేశ ప్రజల కోసం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందేశాన్ని ఇచ్చారు. ఇంటికి, సమాజానికి, జగతికి వెలుగులు పంచే దీపోత్సవమైన దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు తెలిపారు వెంకయ్య నాయుడు. భారతదేశంలో ప్రతి పండుగ, మన సంస్కృతిని మనకు గుర్తుచేస్తుందని… మర్యాదా పురుషోత్తముడైన శ్రీ రామచంద్రుడు 14 ఏళ్ల వనవాసం తర్వాత సీత, లక్ష్మణ సమేతంగా అయోధ్యకు విచ్చేసిన శుభ సందర్భాన్ని దీపావళిగా జరుపుకుంటామని తెలిపారు. భారతీయ సంస్కృతిలోని…
భారత దేశం అభివృద్ధి పథంలో పయనించాలంటే యువతే కీలకమని,మాతృభాషలో చదువుకోవడం అభివృద్ధికి ఏమాత్రం ఆటంకం కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. యువత నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. విజయవాడలోని స్వర్ణభారత్ ట్రస్ట్ శిక్షణ పొందుతున్న యువతీ యువకులతో ఆయన ముచ్చటించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. యువత నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు స్వర్ణభారత్ ట్రస్ట్ పని చేస్తోందన్నారు. భారత సనాతన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శంగా నిలించిందన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారందరూ మాతృ భాషలో నే…
మనల్ని పాలించే నేతలు ఎలా వుండాలి? వారి ప్రవర్తన ఎలా వుండాలి? అనేదానిపై ప్రజలు ఆలోచించాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. విజయవాడలో విద్యార్థులతో ముఖాముఖి లో వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులను ఎన్నుకునే ముందు కులం మతం చూసి ఎన్నుకోకూడదన్నారు. నేతల కులం కన్నా గుణం మిన్న అన్నారు వెంకయ్యనాయుడు. మంచి వారిని సేవా భావం ఉన్న వారిని ప్రోత్సహించాలి నాయకుడిగా ఎన్నుకోవాలి. పార్లమెంట్ కి అసెంబ్లీకి పోయి మాట్లాడేటప్పుడు సభ్యతతో సంస్కారంతో…
ఒకప్పుడు గ్రంథాలయం లేని ఊరు, పట్టణం వుండేదికాదు. కాలక్రమేణ టెక్నాలజీ పెరిగిందనే సాకుతో గ్రంథాలయాలు కనిపించకుండా పోతున్నాయి. విజయవాడలో రామ్మోహన గ్రంధాలయ సందర్శనకు వచ్చిన ఉప రాష్ట్రపతి తాజా పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. గ్రంధాలయం, దేవాలయం, సేవాలయం ప్రతీ ఊరిలో ఉండాలి. రోజులు మారాక గ్రంధాలయాలు కనపడటం లేదు. గతంలో రామ్మోహన గ్రంధాలయంలో ఉపన్యసించే వాడిని. పుస్తకం అందరి చేతిలో ఉండాలి. పుస్తకాలు చదవడం అందరూ అలవరుచుకోవాలన్నారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. సర్ధార్ వల్లభాయ్ పటేల్…
వ్యవసాయ రంగంలో సాంకేతిక పెగాల్సిన అవసరం ఉందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఐవీ సుబ్బారావు రైతు నేస్తం అవార్డు ఫంక్షన్‌లో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జనాకర్షణ పథకాలకు ప్రభుత్వాలు అధికంగా డబ్బు ఖర్చు పెట్టవద్దన్నారు. రైతుకు కావాల్సింది క్వాలిటీ ఉన్న విద్యుత్ పది నుంచి 12 గంటలు ఇవ్వాలన్నారు. రైతు పరపతి వడ్డీ రేట్లు ఇంకా తగ్గించాలన్నారు. ఉచితాలతో, తాత్కాలిక జనాకర్షణ పథకాలతో మేలు ఎవ్వరికి జరగదన్నారు. అందరికీ తెల్ల రేషను కార్డు…
“మహర్షి” సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు చిత్ర బృందానికి చాలా ప్రత్యేకమైన చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడమే కాకుండా ఉపరాష్ట్రపతి ప్రశంసలు సైతం అందుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులను సైతం మెప్పించిన ఈ చిత్రం టాలీవుడ్ లోని ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన రెండు జాతీయ అవార్డులు దక్కాయి. ఈ చిత్రాన్ని నిర్మించిన స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈరోజు ఉపరాష్ట్రపతి…
నేడు దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ సినిమా పురస్కారాల వేడుక జరగనుంది. ఈ 67 వ జాతీయ సినిమా పురస్కారాల వేడుకలో రజినీకాంత్ వంటి పలువురు ప్రముఖులు అవార్డులు అందుకోనున్నారు. వాస్తవానికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ఈ ఏడాది మార్చి లోనే ప్రకటించారు. అప్పట్లోనే అవార్డుల ప్రదానోత్సవం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈరోజు జాతీయ పురస్కారాల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై, అవార్డులను అందజేయనున్నారు. ఇందులో భాగంగానే సూపర్ స్టార్…
భారతీయ కళలలో ప్రధానమైన కూచిపూడి నృత్యం గొప్పదనాన్ని తెలియ చెప్పేలా ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు ‘నాట్యం’ చిత్రం నిర్మించారు. అందులో ఆమె కథానాయికగానూ నటించడం విశేషం. కమల్ కామరాజు, రోహిత్, ఆదిత్య మీనన్, ‘శుభలేఖ’ సుధాకర్, భానుప్రియ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ‘నాట్యం’ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాను కొద్ది రోజుల ముందే భారత ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు వీక్షించారు. ఈ సందర్భంగా చిత్ర బృందాన్ని ఆయన అభినందించారు.…