హైదరాబాద్‌లో యోధా లైఫ్‌లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభమైంది. ఈ డయాగ్నోస్టిక్ సెంటర్‌ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మెగాస్టార్ చిరంజీవిలు ప్రారంభించారు. వైద్యరంగంలో అనేక పెనుమార్పులు వస్తున్నాయని, మార్పులకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరంలో వైద్యం అందుబాటులోకి వస్తోందని మెగస్టార్ చిరంజీవి పేర్కొన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం జీనోమ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. జీన్స్ ను ఆధారంగా చేసుకొని మనిషికి వచ్చే జబ్బులను ముందుగానే తెలుసుకోవచ్చని అన్నారు. కరోనా సమయంలో జీనోమ్ టెక్నాలజీ కృషి ఎనలేనిదని మెగాస్టార్ తెలిపారు. ఇక ఇదిలా ఉంటే, యోధా లైఫ్‌లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ యాజమాన్యం మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు రూ.25 లక్షలను విరాళంగా అందించారు. మెగాస్టార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఎంతో మందికి సేవలు అందిస్తోందని, మరింత మందికి సేవలు అందించాలని కోరుకుంటున్నట్టు యోధా లైఫ్‌లైన్ డయాగ్నోస్టిక్ సెంటర్ యాజమాన్యం తెలియజేసింది.