ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల మాటాల తూటాలు అధికమవుతున్నాయి. తాగా నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంపై బీఆర్‌ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సీఎం కావచ్చు.. కానీ, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తరువాత కేటీఆర్ మాత్రమే సీఎం అవుతారు అని ఆయన విమర్శించారు. మన లక్ష్యం సీఎం పదవి కావొద్దు.. ఎప్పుడో ఒకసారి నేనూ కూడా సీఎం అవుతా.. పదవుల మీద నాకు ఆశ లేదు.. ఆశ ఉంటే ఆనాడు మంత్రి పదవి వదిలి పెట్టే వాడిది కాదు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తాజాగా కాంగ్రెస్ పార్టీలో వేముల వీరేషం జాయిన్ అయిన తర్వాత ఇవాళ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ కోమటిరెడ్డి మాట్లాడుతూ.. నకిరేకల్ నేతల ముందు ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్యపై హాట్ కామెంట్స్ చేశారు. మేము దగ్గరుండి గెలిపిస్తే.. మమ్మల్ని దారుణంగా మాట్లాడుతుండు.. మేము ఫస్ట్ జడ్పీటీసీగా గెలిపిస్తే.. పెద్ద పదవి ఎందుకు అన్నాడు.
Telangana Congress: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య భారీగానే ఉంది. ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభ అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది.
బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు. వారం పది రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు.
చిరుమర్తి లింగయ్య. నకిరేకల్ ఎమ్మెల్యే. 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. ఈయనేమో వేముల వీరేశం. మాజీ ఎమ్మెల్యే. టీఆర్ఎస్ నేత. గత ఎన్నికల్లో లింగయ్య చేతిలో ఓడిపోయారు వీరేశం. ఇక ఈయన కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్లగొండ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే. ముగ్గురూ ముగ్గురే. ఈ ముగ్గురి చుట్టూనే ప్రస్తుతం నకిరేకల్ టీఆర్ఎస్ రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతోంది. లింగయ్య పేరు చెబితేనే వీరేశం.. భూపాల్‌రెడ్డిలు ఒంటికాలిపై లేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ను వీడి కారెక్కినప్పటి నుంచి వీరేశం,…
ఆయన మాజీ ఎమ్మెల్యే. అధికార పార్టీ నేత. మొన్నటి ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అయ్యేవారో లేదో కానీ.. ఓటమి మాత్రం కష్టాలు తెచ్చిపెట్టింది. స్వపక్షంలోని వైరివర్గాల ఎత్తుగడలతో పవర్ కట్ అయిందనే చర్చ జరుగుతోంది. పార్టీలో ఆయన మనుగడే కష్టమైందని టాక్. ఇంతకీ ఎవరా నాయకుడు? అధికార పార్టీలో ఎవరితో పడటం లేదు? ఎమ్మెల్యే చిరుమర్తి చేరిక తర్వాత వీరేశానికి కష్టాలు? వేముల వీరేశం. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే. 2014లో టీఆర్ఎస్ టికెట్‌పై…