బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రకటించారు. వారం పది రోజుల్లో ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన నకిరేకల్ లో తన అనుచరులతో సమావేశం అయ్యారు. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ కోసం పనిచేసాను అని వేముల వీరేశం అన్నారు. నన్ను, నా అనుచరులను కేసులతో వేధించారు.. నా ఇబ్బందులను, కష్టాలను జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి చెప్పుకున్నా స్పందన రాలేదు.. నాలున్నర ఏళ్లు ఓపిక పట్టిన.. జిల్లాలో గ్రూప్ లను మంత్రి ప్రోత్సహిస్తున్నారు అని ఆయన ఆరోపించారు.
Read Also: Viral News: భయపెట్టిన నైటీ.. ఇలా ఎవరైనా చేస్తారా అంటూ గగ్గోలు పెట్టిన మహిళ
తనకు కీలక పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పిన నాటి నుంచే నాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయని వేముల వీరేశం అన్నారు. కేసీఆర్, కేటీఆర్ లు నియోజకవర్గాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.. నేను తప్పుడు పనులు చేయను.. ప్రజలే నా సర్వస్వం.. కార్యకర్తల సూచన మేరకే నా కార్యాచరణ ఉంటుంది.. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మంత్రి జగదీష్ రెడ్డికి నాకు సభ్యత్వం ఇచ్చే దమ్ము లేదు.. ఈరోజు నుంచి నా పోరాటం మొదలు.. ఎన్నికల బరిలోనే ఉంటా.. ప్రజలందరూ కోరుకునే రాజకీయ పార్టీలోకి వెళ్తాను ఆయన ప్రకటించారు.
నేను రాజకీయ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బండారం బయటపెడతాను అని వేముల వీరేశం అన్నారు. ఎమ్మెల్యేగా ఉండగా ప్రత్యర్థులపై విమర్శలు చేసినందుకు విపక్ష పార్టీలు క్షమించండి.. ఎమ్మెల్సీ ఇస్తాము, క్యాబినెట్ స్థాయి పదవులు ఇస్తామని చెప్పినా కార్యకర్తల కోసం నేను అంగీకరించలేదు.. ఎమ్మెల్యే పదవి తప్ప నాకు ఇతర పదవులు వద్దు.. 2018లో కూడా టికెట్ ఇచ్చింది.. కాబట్టి ఇన్ని రోజులు పార్టీలో ఉన్నాను.. ఇప్పుడు టికెట్ రాలేదు కాబట్టి బయటికి వెళ్తున్నాను అని వీరేశం తెలిపారు.
Read Also: Kishan Reddy: ఆ రెండు పార్టీల్లో ఎవరికి ఓటేసినా.. మజ్లిస్ కు ఓటేసినట్లే..
భూకబ్జాదారులను అడ్డుకునేందుకే నక్సలైట్ అయ్యాను అని వేముల వీరేశం అన్నారు. ఆ పంథా వద్దు అనుకున్నాను కాబట్టే ప్రజాస్వామ్యంలోకి వచ్చాను.. బీఆర్ఎస్ పార్టీని వదిలేస్తున్నా.. నా రాజీనామాను ప్రజల ముందు పెడుతున్న.. ప్రజలే నాకు అధిష్టానం.. ఈ క్షణం నుంచి నేను బీఆర్ఎస్ కాదు.. నా గురించి మాట్లాడితే నీ చిలిపి చేష్టలు బహిర్గతం చేస్తానని చిరుమర్తికి వేముల వీరేశం హెచ్చరించాడు.