Telangana Congress: నేడు కాంగ్రెస్ లో భారీ చేరికలు.. కండువా కప్పుకోనున్న రేఖానాయక్, వేముల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీలో చేరే వారి సంఖ్య భారీగానే ఉంది. ఇటీవల హైదరాబాద్ తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభ అనంతరం ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. సీడబ్ల్యూసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు సోనియాగాంధీ ఆరు హామీ పథకాలను ప్రకటించి, ఒకవైపు ఆ పథకాలను పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు కాంగ్రెస్‌లో చేరేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఆరు హామీ పథకాలు ప్రకటించడంతో కాంగ్రెస్ పై నేతల కన్ను పడింది. కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అధికార పార్టీలో నిరుత్సాహం.. కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సాహం లభించడంతో ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే సమక్షంలో భారీ చేరికలు జరగనున్నాయి. కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నవారిలో రేఖా శ్యామ్ నాయక్, నకిరేకల్ వేముల వీరేశం, కుంభం అనిల్ (భువనగిరి), అరేపల్లి మోహన్ (మానకొండూర్) ఉన్నారు. దీంతో ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి
కాంగ్రెస్ లోకి రేఖానాయక్..
Also Read
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
- Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ బీఆర్‌ఎస్‌ను వీడనున్నారు. టికెట్ కేటాయించకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయన అధికార పార్టీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీపీపీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రేఖానాయక్ భర్తకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు 115 మంది అభ్యర్థులతో బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ఈరోజు ప్రకటించారు. అయితే ఈసారి ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వలేదు. ఖానాపూర్ నుంచి బీఆర్ ఎస్ తరఫున రెండుసార్లు గెలిచిన రేఖానాయక్ కు ఈసారి కేసీఆర్ మొండిచేయి చూపారు. పార్టీ అధినేత తనకు టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. బీఆర్‌ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త సోమవారం కాంగ్రెస్‌లో చేరగా, త్వరలో ఎమ్మెల్యే రేఖా నాయక్ హస్తం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేళకు రేఖానాయక్ కాంగ్రెస్ కండువాకప్పుకోనున్నారు.
కాంగ్రెస్ పార్టీలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం..
ఇక మరోవైపు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పలు కారణాలతో కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఆయన చేరిక తుది దశకు చేరుకుంది. ఇందులో భాగంగా శనివారం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఏఐసీసీ కార్యాలయం నుంచి ఆహ్వానం అందడంతో వీరేశం శుక్రవారం ఢిల్లీ వెళ్లారు. అయితే.. కొద్ది రోజులుగా వీరేశం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 17న సీడబ్ల్యూసీ సమావేశాలతో పాటు కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించగా, జాతీయ నేతల బిజీ కారణంగా ఆ రోజు కాంగ్రెస్‌లో చేరలేకపోయారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని, వేముల వీరేశం ఢిల్లీకి రావాలని సూచించారు. దీంతో ఆయన శనివారం ఢిల్లీలో అందుబాటులో ఉండే జాతీయ నేతల సమక్షంలో పార్టీలో చేరనున్నారు. వచ్చే ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వేముల వీరేశం సన్నాహాలు చేసుకుంటూ కొద్ది రోజులుగా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టకేలకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఆహ్వానం అందడంతో ఢిల్లీ వెళ్లారు.
Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్
తాజావార్తలు
-
Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
-
Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
-
Smit Machchhar: భారత హీరో పైలట్‌కు గుజరాత్ అత్యున్నత పురస్కారం..
-
TG TET 2026 : టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రత్యేక TG TET-2026-II నోటిఫికేషన్.!
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?