ఆ మాజీ ఎమ్మెల్యేకి ఓటమి తెచ్చిపెట్టిన కష్టాలేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆయన మాజీ ఎమ్మెల్యే. అధికార పార్టీ నేత. మొన్నటి ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అయ్యేవారో లేదో కానీ.. ఓటమి మాత్రం కష్టాలు తెచ్చిపెట్టింది. స్వపక్షంలోని వైరివర్గాల ఎత్తుగడలతో పవర్ కట్ అయిందనే చర్చ జరుగుతోంది. పార్టీలో ఆయన మనుగడే కష్టమైందని టాక్. ఇంతకీ ఎవరా నాయకుడు? అధికార పార్టీలో ఎవరితో పడటం లేదు?
ఎమ్మెల్యే చిరుమర్తి చేరిక తర్వాత వీరేశానికి కష్టాలు?
Also Read
వేముల వీరేశం. ఉమ్మడి నల్లగొండ జిల్లా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే. 2014లో టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి.. ముందస్తు ఎన్నికల వరకు నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో పెత్తనం చేశారు. 2018 ఎన్నికల్లో మరోసారి బరిలో దిగినా స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2018లో గెలిస్తే ఎస్సీ కోటాలో మంత్రి అవ్వొచ్చని అనుకున్నారట వీరేశం. ఆ ఓటమి కుంగదీసినా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టడంతో ఆయన తేరుకున్నారు. కానీ.. తనపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య.. గులాబీ కండువా కప్పుకోవడంతో వీరేశం బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని టీఆర్‌ఎస్ వర్గాలు కథలు కథలుగా చెప్పుకొంటాయి.
ఆధిపత్యపోరుతో పలుమార్లు రోడ్డెక్కిన అనుచరులు!
నకిరేకల్‌లో టీఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గానికి ఎమ్మెల్యే లింగయ్య, మరో వర్గానికి వీరేశం కాపు కాస్తున్నారట. వీరి మధ్య ఆధిపత్యపోరు.. రోడ్డుకెక్కిన సందర్భాలూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులకు టికెట్లు ఇవ్వకపోవడంతో ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేయించారట మాజీ ఎమ్మెల్యే. ఆ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు 11 వార్డుల్లో, వీరేశం అనుచరులు 6 చోట్ల గెలిచారు. ఒకరిపై ఒకరు పైచెయ్యి సాధించేందుకు ఇద్దరూ వేయని ఎత్తుగడలు లేవు. ఓ మంత్రి కూడా ఎమ్మెల్యేతో కలిసి తమను ఇబ్బంది పెడుతున్నారని వీరేశం వర్గం అనుమానిస్తోందట. ఈ గొడవల వల్ల గుర్తింపు లభించడం లేదని అనుకుంటున్నారో ఏమో.. కేడర్ కూడా వీరేశం దగ్గర నుంచి జారిపోతోందని ప్రచారం జరుగుతోంది.
వీరేశానికి ప్రభుత్వ భద్రత తొలగింపు!
తాజాగా వీరేశానికి భద్రతగా ఉన్న గన్‌మెన్స్‌ను ప్రభుత్వం తొలగించింది. 2 ప్లస్ 2గా ఉన్న భద్రతను ఉపసంహరించడంతో మళ్లీ చర్చల్లోకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే. సెక్యూరిటీ విత్‌డ్రా వెనక కారణాలేవైనా.. వీరేశం వైరివర్గం ఒత్తిళ్ల వల్లే చెక్ పెట్టారని ప్రచారం జరుగుతోందట. ఉమ్మడి నల్లగొండ జిల్లాలకు చెందిన ఇతర మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు భద్రత కొనసాగుతుండగా ఒక్క వీరేశానికే ఎందుకు తొలగించారని ప్రశ్నిస్తున్నారట ఆయన అనుచరులు.
టీఆర్‌ఎస్‌లో ఉనికి కోసం పోరాటం?
గతంలో వామపక్ష ఉద్యమాల్లో చురుకుగా పనిచేశారు వీరేశం. అందువల్ల ఆయనకు ప్రాణహాని ఉందన్నది మాజీ ఎమ్మెల్యే అనుచరుల వాదన. అయితే ఇటీవల కాలంలో ఆయన తీరు.. పార్టీలో చర్చగా మారుతోందట.. అనుమానాలు రేకెత్తించేలా ఉందని టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోందట. పార్టీలో ప్రాధాన్యం తగ్గించడానికి అది కూడా ఒక కారణంగా వైరివర్గం ప్రచారం చేస్తోందట. మొత్తానికి టీఆర్ఎస్‌లో ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే పోరాడాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారట అనుచరులు. మరి.. ఆధిపత్యపోరులో నెగ్గుకురావడానికి వీరేశం ఏం చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!