Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి సోషల్ మీడియాలో వాట్సాప్ ఛాట్టింగ్ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ నిందితుడు జనార్ధన్‌తో ఛాట్టింగ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ వైరల్ గా మారింది. దీనిపై జోగి రమేష్ సీపీకి ఫిర్యాదు చేశారు. కావాలని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జోగి ఫిర్యాదులో పేర్కొన్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావు నిందితుడు జనార్ధన్‌తో ఛాట్టింగ్…
జోగి రమేష్ చేసిన ఆరోపణలకు అదేస్థాయిలో కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. అసెంబ్లీ సమావేశాలలో NTPSలో బూడిద సమస్య గురించి నేను ప్రశ్న అడిగాను.. సోమవారం ఈ ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం అసెంబ్లీలో వస్తుందని తెలిపారు.. అయితే, జోగి రమేష్ దురదృష్ట వశాత్తూ రెండు సార్లు గెలిచారు.. NTPS బూడిద కాంట్రాక్టర్ తో కుమ్మక్కై జోగి ఇలా మాటాడుతున్నారు అంటూ ఫైర్ అయ్యారు..
ప్రభుత్వం జిల్లాలో కృష్ణా నదీ తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తోంది. ఇబ్రహీంపట్నంను ఆనుకుని ఉన్న కృష్ణా లంక భూములను మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా, జిల్లా కలెక్టర్ లక్షిషా, ఇతర అధికారులు పరిశీలించారు. కృష్ణా నదిలో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల పరిధిలోనీ పెద లంక, చిన లంకలో ఉన్న లంకభూములు పరిశీలించారు. మూడు కిలోమీటర్లు లంక భూముల్లో కాలినడకన తిరిగారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో…
ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వేళ భారీగా వలసలు జరుగుతున్నాయి. టికెట్ దక్కనివారు పక్క పార్టీల వైపు చుస్తున్నారు. తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ తీర్థం పచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. వసంతతో పాటు మైలవరానికి చెందిన చాలామంది టీడీపీలో చేరారు. వసంత కృష్ణ ప్రసాద్ ఎంట్రీతో మైలవరంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావులు మైలవరం టికెట్ ఆశిస్తున్నారు. ఇంతలో టీడీపీలోకి…
హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరానని తెలిపారు.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టీడీపీ చేరారు. హైదరాబాద్‌లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వసంత కృష్ణప్రసాద్ వెళ్లారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు.
మైలవరం టీడీపీలో పొలిటికల్ రచ్చ జరుగుతోంది. వసంత వర్సెస్ దేవినేనిగా మారిన మైలవరం నియోజకవర్గ రాజకీయాలు మారిపోయాయి. పోటా పోటీ కార్యక్రమాల దెబ్బకి టీడీపీ క్యాడర్‌లో హైరానా మొదలైనట్లు తెలుస్తోంది.