Mailavaram Politics: ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠగా మారుతున్నాయి. మైలవరంలో దేవినేని ఉమాకి షాక్ తగిలింది. మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్, దేవినేని ఉమా, బొమ్మ సాని సుబ్బారావులు టీడీపీ టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం బొమ్మసాని సుబ్బారావును కలిసి ఇకపై కలిసి పని చేస్తున్నట్టు దేవినేని ఉమా ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. ఈ క్రమంలో దేవినేని ఉమా తీరును తప్పుబట్టారు బొమ్మసాని సుబ్బారావు. యాదృచ్ఛికంగా జరిగిన దాన్ని కూడా ఇలా రాజకీయం చేయటం తగదని ఉమాకి సూచన చేశారు బొమ్మసాని.
Read Also: Kalyandurg: కళ్యాణదుర్గం టీడీపీలో వర్గ విభేదాలు..! ఇప్పుడు ఫ్లెక్సీ వార్..
పార్టీ కోసం స్థానికంగా పని చేసిన తనకు చంద్రబాబు టికెట్ ఇస్తారని నమ్మకం ఉందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మసాని సుబ్బా రావు పేర్కొన్నారు. వసంతకు ఇక్కడ టికెట్ ఇస్తారనే సమాచారం తనకు లేదన్నారు. వసంత వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పార్టీ నేతలతో తలెత్తిన ఘర్షణ పరిస్థితుల నేపథ్యంలో అధిష్టానం ఆలోచన చేయాలన్నారు. వసంతకు పెనమలూరు ఆప్షన్ ఉందన్నారు. దేవినేని ఉమా రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. రాజకీయంగా ఉమా ఎన్నో ట్రిక్స్ ప్లే చేస్తున్నారని.. తనతో కలుస్తున్నా అనటం అందులో భాగమేనన్నారు. టికెట్ కోసం ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసినా అధిష్టానం టికెట్ ఫైనల్ చేస్తుందన్నారు. ఉమా అంతా నేనే పొందాలి అనుకోవడం వల్లే జిల్లాకు ఈ పరిస్థితి అని ఆయన విమర్శించారు. పార్టీలో మిగతా వారిని కూడా ఉమా ఎదగ నివ్వాలని ఆయన అన్నారు. సర్వేలు చేసిన తర్వాత చంద్రబాబు టికెట్ తనకే ఇస్తారని నమ్ముతున్నానని బొమ్మసాని సుబ్బారావు తెలిపారు. అంతిమంగా పార్టీ నిర్ణయం పాటిస్తానన్నారు.