Vasantha Krishna Prasad: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. ఈ సారి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ కండువా కప్పుకున్నారు వసంత.. అయితే, అప్పటికే ఆ స్థానంలో గ్రౌండ్ వర్క్ ప్రిపేపర్ చేసుకున్న మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఓవైపు బొమ్మసాని సుబ్బారావు మరోవైపు టికెట్ ఆశిస్తున్నారు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అని మీరు అనుకోవద్దు.. నన్ను, ఉమాని కాదని మూడో వ్యక్తిని పెట్టినా తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం అన్నారు.. అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనంపై అంతే దీటుగా పని చేస్తాను అని స్పష్టం చేశారు.
Read Also: Guntur kaaram: ఇదెక్కడి వింత!.. ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేయడమేంటి?
నేను తెలుగుదేశం పార్టీలో చేరి మీలో ఒకడిగా మీతో కలిసి నడవడానికి మీ దగ్గరకు వచ్చాను అన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టించలేదనే గతంలో వైసీపీ నాయకులు కొందరు నాతో విభేదించారన్న ఆయన.. తప్పు లేనప్పుడు అనవసరంగా కేసులు పెట్టడాన్ని నేను ఒపతపుకోనని చెప్పాను అన్నారు. ఇక, నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుండి రాజకీయ విభేదాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. అయితే, వైసీపీలో ఉన్నప్పుడు ఉమాకి వ్యతిరేకంగా మాట్లాడాను.. అంతే తప్ప ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నేను దూషించలేదన్నారు. 2024 ఎన్నికలు చాలా కీలకం, తెలుగుదేశం పార్టీకి చావు బ్రతుకుల సమస్యగా అభివర్ణించారు. అంగబలం, అర్థబలంతో పాటు అధికారం చేతిలో ఉండడంతో మరో మారు అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.