తిరువూరులో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో భాగంగా.. సభలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై చర్చ జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలను పేరుపేరునా చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. కానీ.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృషప్రసాద్ ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఏ విమర్శలు చేయకుండా చంద్రబాబు స్కిప్ చేశారు.
మాజీ మంత్రి దేవినేని ఉమాపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. 'అన్నీ ఉన్నమ్మ అణిగి మణిగి ఉంటే ఏమి లేనమ్మ ఎగిరెగిరి పడుతోంది' అన్నట్లుగా దేవినేని ఉమా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.
Off The Record: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా మారారు. గతంలో సొంత పార్టీ నేతల మీద, ప్రభుత్వ నిర్ణయాల మీద… సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆరున్నొక్క రాగాన్ని ఆలపించిన వసంత…సీఎం జగన్‌తో భేటీ తర్వాత కాస్త మెత్తబడ్డారని అంతా అనుకున్నారు. కానీ.. ఆయన తాజా చర్య తిరిగి కలకలం రేపుతోందట. తన నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, దాన్ని కట్టడి చేస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు, ఇతర…
Off The Record: మైలవరం నియోజకవర్గం ఇప్పుడు ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో ఈ సెగ్మెంటులో వసంత వర్సెస్ దేవినేని అన్నట్టు ఉండేది. గత కొంతకాలంగా మైలవరంలో వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా మారిపోయింది. దీంతో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వైఖరి ఆసక్తిగా మారింది. గతంలో ఒకట్రొండు సందర్బాల్లో మంత్రి జోగి రమేష్ వంటి నేతలను ఉద్దేశించి వసంత కొన్ని కామెంట్లు చేసినా.. ఆ తరవాత అధిష్ఠానం జోక్యంతో గొడవ సద్దుమణిగిందనే…
Kodali Nani: మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదంటూ వైసీపీ నేత వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి కొడాలి నాని ఖండించారు. ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయని చెప్పారు. కమ్మ సంఘం సమావేశాల్లో సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. గత టీడీపీ హయాంలో మైనార్టీ , ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని కొడాలి నాని గుర్తుచేశారు. ఒక్క కమ్మ సామాజిక వర్గానికే…
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ గత నెల 11న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి పిలుపిచ్చారు. ప్రతి ఎమ్మెల్యే తమ నియోజకవర్గ పరిధిలోని ఒక్కో గ్రామ, వార్డు సచివాలయాన్ని రెండురోజులపాటు సందర్శించాలి. నెలలో పది సచివాలయాలకు వెళ్లాలని శాసనసభ్యులకు సీఎం జగన్ టార్గెట్ ఫిక్స్ చేశారు. ఆ సచివాలయాల పరిధిలో ఉండే కుటుంబాల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల లేఖను అందజేయాలి. వారిని అడిగి పథకాలు అందుతున్నయో లేదో నిర్ధారించుకోవాలని చెప్పారు. సమస్యలు ఉంటే…
తీవ్ర ఉత్కంఠ మధ్య కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపల్ ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. చేయి ఎత్తి ఛైర్ పర్సన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. టీడీపీ అభ్యర్థి చెన్నుబోయిన చిట్టిబాబుకు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ఇచ్చారు. వైసీపీ అభ్యర్థి జోగి రాముకు వైసీపీ కౌన్సిలర్ల మద్దతు లభించింది. టీడీపీ వైస్ ఛైర్ పర్సన్ అభ్యర్థులు లక్ష్మీ, శ్రీనివాస్ కు టీడీపీ కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. ఎక్స్ అఫిషీయో సభ్యులుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు టీడీపీ ఎంపీ…